తెలుగు రాష్ట్రాల పర్యటన కోసం వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. నిన్ననే తెలంగాణలో కేసీఆర్ గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెట్టి.. అమిత్ షా తీరును ఏకిపారేశారు.. దేశాన్ని పాలించే పార్టీ అధినేతనే క్షమాపణ చెప్పి మరీ తెలంగాణ వదిలి పోవాలని డిమాండ్ చేశారు. నీవు చెప్పే కబుర్లు వినే హౌలా గాళ్లలా కనిపిస్తున్నామా అంటూ రెచ్చిపోయారు. 


            అమిత్ షాకు వడ్డించిన భోజనం ఎక్కడ వండారో కేసీఆర్ చెప్పారు..!?

ఇక ఆ పర్యటన చేదు జ్ఞాపకాలను తుడిచేసుకుని ఆంధ్రాలో అడుగుపెట్టిన అమిత్ షాకు ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. మధ్యాహ్నం ఇంటికి పిలిచి కమ్మని విందు భోజనం ఏర్పాటు చేశారు. స్థానిక వంటకాలతో అమిత్ షాకు చంద్రబాబు భారీగా విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇందులో ప్రసిద్ధమైన తెలుగు 
వంటకాలన్నీ పెట్టారట. 



గొంగూర, ఆవకాయ పచ్చడి, ఉలవచారు, వెన్నపూస, నాటు కోడి, చేపల పులుసుతోపాటు గుమ్మడి కాయ వడియాలు, పూతరేకులు, బూరెలు, బొబ్బట్లు, గారెలు, బందరు లడ్డు..అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే అమిత్ షాకు చంద్రబాబు వడ్డించిన వంటకాల జాబితా చాలానే ఉంది. ఈ విందుకు అమిత్ షాతో పాటు వెంకయ్య నాయుడు, సురేష్ ప్రభు వంటి కేంద్రమంత్రులు.. పలువురు టీడీపీ, బీజేపీ ప్రముఖులు హాజరయ్యారట. 



ఈ విందు సమావేశంలోనే అనేక రాజకీయ అంశాలపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపైనా చర్చించారట. ఎంతైనా అలయన్స్ పార్టీ నేత. అందులోనూ సెంటర్లో పవర్ లో ఉన్నవాడు.. అందుకే బాబు అమిత్ షాను బాగానే మంచి చేసుకున్నట్టు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: