తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన అమెరికా పర్యటనను పెట్టుబడుల సాధనకే కాకుండా...రాజకీయంగా తమ పార్టీ బలాన్ని పెంచుకునేందుకు కూడా ఉపయోగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పలు కంపెనీల అధినేతలతో పెట్టుబడుల సాధనకు సమావేశం అవుతున్న మంత్రి కేటీఆర్ ఈ క్రమంలోనే టీఆర్ఎస్ సానుభూతిపరులైన ఎన్నారైలతో సమావేశమయ్యారు.


అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాంటాక్లారాలో టీఆర్ ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ - కాంగ్రెస్ నాయకులను చూసి చిన్న పిల్లలు కూడా అసహ్యించుకుంటున్నారని అన్నారు.  కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.


వెయ్యి మంది విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్ నాయకులే కారణమని కేటీఆర్ మండిపడ్డారు. ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుత పాలనను అందిస్తున్నారని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: