తెలంగాణ సీఎం కేసీఆర్ చేయించిన ఎన్నికల సర్వేలో భలే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో గెలుస్తాం అనే అంశంపైనే కాకుండా 
నాయకుల పనితీరు, విశ్వసనీయతపై కూడా కేసీఆర్ సర్వే చేయించారు. దాని ప్రకారం కేసీఆర్ కు తన సొంత నియోజకవర్గంమైన గజ్వేల్ లో ఏకంగా నూటికి 98 శాతం 
మార్కులు రావడం విశేషం. 

Image result for kcr election survey

ఇక తెలంగాణ సర్కారులో కేసీఆర్ తర్వాత స్థానంలో ఉన్నది కేటీఆరే కదా.. ఆయన కూడా సరిగ్గా మార్కుల్లోనూ సెకండ్ ప్లేస్ లోనే వచ్చాడు. మంత్రి కేటీఆర్  ప్రాతినిధ్యం 
వహించిన సిరిసిల్ల 91 శాతంతో  రెండోస్థానంలో నిలిచింది. ఇక నెంబర్ త్రీగా పేరున్న హరీశ్ రావు మార్కుల్లోనూ నెంబర్ 3 గానే మిగిలారు. హరీశ్ రావు ఆయన ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట 88శాతంతో మూడో స్థానంలో నిలిచింది.

Image result for kcr ktr harish


ఇక ఆ తర్వాత స్థానంలో ఎమ్మెల్యే రాజయ్య ప్రాతినిధ్యం వహించిన  స్టేషన్ ఘన్ పూర్  86 శాతంతో ఉంది. వచ్చే ఎన్నికల్లో మోడీ హవా అంతగా ఉండదని కేసీఆర్ చెబుతున్నారు. జిల్లాల్లో ఎంపీలు, మంత్రులు కలిసి పనిచేయాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన జులైలో ప్రారంభమయ్యే అవకాశముందని పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: