భూమి మీద పెట్టుబడి పెడితే ఎక్కడికీ పోదన్నది ఒక నమ్మకం. ఈ నమ్మకం చాలా ఏళ్ల నుంచి కొనసాగుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత భూముల విలువలు కొన్నిచోట్ల అమాంతంగా పెరిగాయి. ఇప్పుడు కాస్త ధర ఎక్కువైనా తమ అభిరుచికి అనుగుణంగా ఇల్లు కట్టుకునేందుకు స్థలాలు కొని పెట్టుకుంటారు చాలామంది. తక్కువలో ఉన్నప్పుడే స్థలం కొంటారు. 

అలా మీరూ కొంటే.. ఒక్కసారి మీ పత్రాలను సరిచేసుకోండి. ఆ పత్రాల్లో ఏముందో చదివి తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో  భూ సమస్యలు తీవ్రం అయ్యాయి. ఇలాంటి లొసుగులను అడ్డం పెట్టుకునే.. కొందరు అధికారులతో కుమ్మక్కై భూములు హాంఫట్ చేస్తున్నారు. ఒకటీ అరా కాడు.. ఏకంగా వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. 

Image result for hyderabad lands

అదేమని ఎవరైనా అడిగితే చాలు.. వాళ్ల మనుషులు  అడిగినవారిపై దాడులు చేస్తున్నారు. తాజాగా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ రెవెన్యూ గ్రామపరిధిలో పలు సర్వే సంఖ్యల్లోని ప్రభుత్వ భూములను కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రావు ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ చేయడం తాజాగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఈ ఉదంతంపై అంతర్గత విచారణ నిర్వహించి ఆయనపై చర్యలు తీసుకున్నారు. 

ఐతే.. ఇంత భారీ అక్రమం జరగడానికి కొందరు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సహకరించారు. రిజిస్ట్రేషన్ శాఖలో లోపాలు చోటుచేసుకుంటున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు కూడా. మొత్తానికి జనం సొమ్ముకు టోపీ పడింది. అందుకే భూ యజమానులారా తస్మాత్ జాగ్రత్త. 



మరింత సమాచారం తెలుసుకోండి: