ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై విమర్శలు చేయడంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సిద్దహస్తుడున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మంత్రి పదవి కూడా రావడంతో ఆయన మరింతగా రెచ్చిపోతున్నారు. తాజాగా జగన్ వ్యవహారశైలిపై మరోసారి మండిపడ్డారు సోమిరెడ్డి. 




మహానాడు సదస్సు లో పాల్గొన్న ఆయన.. అక్కడ నిర్వహించిన ప్రెస్ మీట్లో జగన్ పై నిప్పులు చెరిగారు. రైతుల కోసం చంద్రబాబు సర్కారు అన్ని చర్యలు తీసుకుంటుంటే... జగన్ మాత్రం సర్కారుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సర్కారు మిర్చి, పసుపు రైతుల పంటను అదనపు  ధర ఇచ్చి కొంటోందని వివరించారు.

jagan health కోసం చిత్ర ఫలితం



కానీ పక్కన ఉన్న తెలంగాణలో అదనపు ధర ఇవ్వకపోయినా.. రైతులకు బేడీలు వేసినా జగన్ చోద్యం చూస్తున్నారని.. అక్కడి సర్కారుపై వైసీపీ పోరాడటం లేదని సోమిరెడ్డి గుర్తు చేశారు. రైతుల కోసం పని చేస్తున్న తమపై రాళ్లేయడం జగన్ కు అలవాటైపోయిందని సోమిరెడ్డి విమర్శించారు. 



అంతేకాదు.. సొంత కేసుల విషయంలో ప్రధాని మోదీ కాళ్లుపట్టుకోవడానికి వెళ్లి... బయటికొచ్చి రైతుల కోసం మాట్లాడానని జగన్ సిగ్గులేకుండా చెబుతున్నారని సోమిరెడ్డి అన్నారు. రైతుల కోసం జగన్ ఏమీ చేయడని.. కాకపోతే 3 నెలలకోసారి 2 రోజులపాటు నిరాహారదీక్ష చేస్తారని ఎద్దేవా చేశారు. అది కూడా వైద్యుడు 2 నెలలకోసారి 2 రోజులు ఉపవాసం ఉండమన్నారని అందుకే జగన్ ఆ దీక్షలు చేస్తారని విమర్శించారు సోమిరెడ్డి. 



మరింత సమాచారం తెలుసుకోండి: