హైదరాబాద్ లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. దీని విలువ దాదాపు పది వేల కోట్ల రూపాయలు ఉండొచ్చని అధికారులు గుర్తించారు. మియాపూర్ లో 692 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్టు అధికారులు ఐడెంటిఫై చేశారు. సర్వే నెంబర్ 100 లో 207 ఎకరాలు, సర్వే నెంబర్ 101లో 231 ఎకరాలు, సర్వే నెంబర్ 20లో 109 ఎకరాలు, సర్వే నెంబర్ 28లో 145 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ అయ్యాయట. 

ఇంతకీ ఈ పని చేసింది ఏకంగా సబ్ రిజిస్ట్రారే.. ఈ భూముల విలువ మొత్తం పది వేల కోట్ల రూపాయలని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ ప్రైవేటు భూములే.. వీటిని అప్పనంగా నిబంధనలకు విరుద్దంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్టు అధికారులు నిర్ధారించారు. ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. 

miyapur land scam కోసం చిత్ర ఫలితం

ఈ కుంభ కోణం వెనుక ఏమైనా పెద్ద తలకాయలు ఉన్నాయోమోనని దర్యాప్తు చేస్తున్నారు. సంచలనం రేపిన ఈ మియాపూర్ భూముల కుంభకోణంలో ప్రభుత్వ ఖజానాకు 587 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందట. కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావుతో పాటు రెండు ప్రముఖ సంస్థల డైరెక్టర్లనూ పోలీసులు అదివారం అరెస్ట్ చేశారు. నిబంధనల ప్రకారం  ఈ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు గానీ, సంస్థలకు గానీ రిజిస్ట్రేషన్ చేయరాదు. 


ఐతే.. ట్రినిటీ ఇన్ ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్  పి.ఎస్. పార్థసారథి మరికొందరితో కలిసి 2016 జనవరి 15న అమీరున్నీసా బేగం అనే మహిళతోపాటు మరో ఏడుగురి పేరిట జీపీఏ తయారు చేయించారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే గోల్డ్ స్టోన్ ఇన్ ఫ్రా, ట్రినిటీ ఇన్ ఫ్రా వెంచర్స్ డైరెక్టర్, సువిశాల్ పవర్ జెన్ లిమిటెడ్ ప్రతినిధి పీవీఎస్ శర్మ పేరిట డీడ్ రాసిచ్చారు. తర్వాత పార్థసారథి, పీవీఎస్ శర్మ, కూకట్ పల్లి  సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: