హైదరాబాద్ లో కలకలం సృష్టించిన భూ కుంభకోణంపై తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అక్రమార్కులు ఎంతటి వారైనా వదలిపెట్టవద్దని ఏసీబీకి చెప్పినట్టు సమాచారం. కేసీఆర్ ఆదేశాలతో ఏసీబీ జోరు పెంచింది. తెలంగాణలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై దాడులు ముమ్మరం చేసింది.

miyapur landscam కోసం చిత్ర ఫలితం

వరుసగా రెండో రోజూ రిజిస్టేషన్‌ శాఖ కార్యాలయాలపై పోలీసులు, ఏసీబీ అధికారుల దాడులు కొనసాగించారు. అక్రమాలతో సబ్‌ రిజిస్ట్రార్లు కోట్లకు పడగలెత్తారన్న వార్తలు రావడంతో వారి ఇళ్లపైనా దాడులు జరుగుతున్నాయి. ఆదాయనికి మించి ఆస్తులు ఏమైనా కూడబెట్టారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ల అక్రమార్జనపై నిఘా వర్గాలు కూడా దృష్టి సారించాయి. 

miyapur landscam కోసం చిత్ర ఫలితం

రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులపై దృష్టి సారించిన నిఘా వర్గాలు వారి పుట్టుపూర్వోత్తరాలను కూడా ఆరా తీస్తున్నారట. గతంలో ఎక్కడ పనిచేశారు.. ఆ సమయంలో అక్కడ ఏమైనా కుంభకోణాలు జరిగాయా అన్న విషయాలు ఆరా తీస్తున్నారట. తెలంగాణ మూడో వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ ఇలాంటి అవినీతి మకిలి అంటరాదన్న కృతనిశ్చయంతో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: