ఏపీ సీఎం చంద్రబాబు పనితీరుపై విపక్ష నేతలు ఘాటుగా విరుచుకుపడుతున్నారు. నవ నిర్మాణదీక్ష పేరుతో జూన్ 2 చంద్రబాబు చేయించిన ప్రతిజ్ఞలు.. విజయవాడ బెంజ్ సర్కిల్ లో నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమ నిర్వహణ తీరుపై వారు విమర్శలు కురిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన చేష్టలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులూ కొలుసు పార్ధసారధి విజయవాడలో అన్నారు.



విజయవాడ నగరంలో జాతీయ రహదారులను దిగ్భంధం చేసి రోడ్డుపై మండుటెండలో నవనిర్మాణ దీక్ష పేరుతొ ప్రజలను చంద్రబాబు ఇబ్బందులు పెట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతి సంవత్సరం నవ నిర్మాణ దీక్ష పేరుతొ ప్రజలను మోసగిస్తోందన్నారు. విభజన చట్టంలోని హామీలను రాబట్టడం లో పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారన్నారు.



సుప్రీం కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసి దీక్షలా పేరుతొ జాతీయ రహదారుల్ని దిగ్భంధం చేసారన్నారు. ప్రతిపక్షాల దీక్షలకు అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వమే ఈ తరహా చర్యలకు పాలపడడం అమానుషం అన్నారు. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి 9 గంటల తర్వాత బయటకు రావద్దని స్వయంగా కలెక్టరే చెబుతున్నారని.. మళ్లీ వారే ఎండల్లో దీక్షలు నిర్వహిస్తున్నారని పార్థసారధి విమర్శించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: