ఉగ్రవాదుల భయం ప్రపంచాన్ని ఎప్పుడు వదులుతుందో తెలీదు కానీ తాజాగా బెల్జియం రాజధాని బ్రెస్సిల్ రైల్వే స్టేషన్ మీద ఉగ్రదాడి జరిగింది. మంగళ వారం రాత్రి బ్రెస్సిల్స్ రైల్వే స్టేషన్లోకి వచ్చిన ఒక వ్యక్తి సూట్కేసు బాంబుని పేల్చడం తో వెంటనే గట్టిగా శబ్దం వచ్చింది. ఆ దగ్గరలో గస్తీ కోసం ఉన్న కొందరు సెక్యూరిటీ సిబ్బంది సైనికులకి సమాచారం చేర వేసారు.


వెంటనే వారు దాదాపు ముప్పై సెకన్ల వ్యవధి లో మెరుపులా అతని మీదకి దాడి చేసి ఆత్మాహుతి కి సిద్దం అవుతున్న అతన్ని గన్నుతో పేల్చి చంపేశారు. అతను ఆత్మాహుతి చేసుకోవడం కోసం ఒక కోటుని వేసుకున్నాడు అన్ని తెలుస్తోంది. అతను అల్లా హూ అక్బర్ అంటూ పేలుడు జరగడానికి రెండు నిమిషాల ముందర  గట్టిగా అరిచాడు అని ప్రత్యక్షంగా ఈ సీన్ చూసిన సాక్షులు చెబుతున్నారు.


గత ఏడాది మార్చ్ లో అదే ప్రాంతం లో జరిగిన ఆత్మాహుతి దాడి లో ముప్పై రెండు మంది చనిపోయారు. అప్పటి నుంచీ భద్రతని విపరీతంగా పెంచిది అక్కడి ప్రభుత్వం. ఈ ఘటన తరవాత ముఖ్యమైన అన్ని ప్రాంతాలలో భద్రతా దళాలు నిత్యం కాపు కాస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: