Image result for law & order in mg road bangalore with women


ఆధునిక మహానగరం కాదు కాస్మోసిటి బాంగ బెంగళూరు మహిళలకు రక్షణ నివ్వలేని నగరంగా మారింది. వ్యవస్థలు కుప్పకూలాయని గత డిసెంబర్ 31 అర్ధరాత్రి నుండే తేలిపోయింది.   నగరంలో ప్రస్తుతం "లా అండ్ ఆర్డర్" అదే శాంతి భద్రతలు  సక్రమంగానే ఉన్నా తన కూతురిని మాత్రం రాత్రిపూట వంటరిగా బయటికి పంపనని ఒక అధికార కాంగ్రెస్ నేత కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన దినేష్ గుండురావు ఈ దిగ్భ్రాంతికర సంచలన వ్యఖ్యలు చేశారు.

2017 న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31 2016,  అర్ధరాత్రి బెంగళూరులోని ఎంజీ రోడ్డులో ఆకతాయిలు రెచ్చి పోయారు. రోడ్డుపై వెళ్తున్న అమ్మాయిలను వేధించారు. ఈ సంఘటనలు నగర వాసులను షాక్‌కు గురిచేశాయి. బెంగళూరులో ఆడపిల్లలకు రక్షణ లేదంటూ విపక్షాలు సైతం ప్రభుత్వం‌పై విరుచుకుపడ్డాయి.


అయితే "మహిళల రక్షణ" అనే అంశంపై బుధవారం బెంగళూరు లోని మౌంట్ కార్మెల్ కాలేజీ లో, "మిర్రర్-నౌ" వార్తా వెబ్‌సైట్ అర్బన్ డిబేట్‌ను నిర్వహించింది. ఈ డిబేట్‌ లో పాల్గొన్న దినేష్ మాట్లాడుతూ, "గడిచిన కొన్ని నెలలతో పోలిస్తే బెంగళూరులో లా అండ్ ఆర్డర్ మెరుగుపడింది. కానీ రాత్రిళ్లు నా కూతుర్ని మాత్రం ఎంజీ రోడ్‌కు నేనెట్టి పరిస్థితుల్లోనూ పంపించను"  అని అన్నారు. 


మగాళ్లు వచ్చి ఏదో ఉద్దరిస్తారని మహిళలు వేచిచూడకూడదని, తమ గళాన్ని తామే గట్టిగా వినిపించాలని అధికార లాంగ్రేస్ కే చెందిన ఈ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు, పాలన తీరే కాదు నగరం దుస్థితిని తెలుపుతుంది. 

Image result for law & order in mg road bangalore with women

మరింత సమాచారం తెలుసుకోండి: