ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు పై గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు టార్గెట్ చేసుకున్నారు.  ఏ చిన్న అవకాశం దొరికినా ఆయనను తిట్టే కార్యక్రంలో ఉన్నారు.  ఇక వైసీపీ ఎమ్మేల్యే రోజా గురించి కొత్తాగా చెప్పాల్సిన అవసరం లేనే లేదు.  నిన్న వైజాగ్ లో వైసీపీ అద్యక్షులు వైఎస్ జగన్ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు.  భూ కుంభకోణానికి పాల్పడ్డ వారందరికీ శిక్షపడే వరకు విశ్రమించేది లేదని ప్రజలకు వాగ్ధానం చేశారు.  
Image result for chandrababu nandyala speech
నిన్న నంద్యాల పార్టీ మీటింగ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన పాలన నచ్చకపోతే పెన్షన్ తీసుకోవద్దు.. తానేసిన రోడ్లపై నడవద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  చంద్రబాబు వ్యాఖ్యలు అహంకారపూరితమని, ఒకరకంగా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేయడమేనని వెన్నపూస మండిపడ్డారు.
Related image
ఇప్పటికైనా చంద్రబాబు బెదిరింపు ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు. పెన్షన్లు, రోడ్ల కోసం ఖర్చు పెట్టేది సీఎం చంద్రబాబు సొంత డబ్బు కాదని, అది ప్రజల డబ్బన్న సంగతి తెలుసుకోవాలని సూచించారు.  తాను రాష్ట్రానికి, అన్ని వర్గాల ప్రజలందరికి ముఖ్యమంత్రినని మరిచిన చంద్రబాబు...జనంతో కక్ష సాధింపు ధోరణితో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: