ఆ మధ్య ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అంటూ చంద్రబాబు సిగ్నల్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అంటూ ఉంది మీడియా కూడా. మనకి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నారా లోకేష్ , బాలయ్య బాబు లని ఏ ప్రాంతాలలో ఎమ్మెల్యే లుగా నిలబెట్టాలి అనేది బాబుగారు ఇప్పటికే ఒక క్లారిటీ తో ఉన్నట్టు తెలుస్తోంది.


లోకేష్ గెలుపు చాలా తేలికగా ఉండాలి అనీ మళ్ళీ లోకేష్ గనక ఓడిపోతే తన పరువు పోతుంది అనే ఉద్దేశ్యం లో చంద్రబాబు ఆలోచనలు సాగుతున్నాయి. ఏరి కోరి ఒక సరైన ప్రాంతాన్ని చంద్రబాబు లోకేష్ కోసం సిద్దం చేసారట. కృష్ణా జిల్లాలోని పెన‌మ‌లూరు నియోక‌వ‌ర్గం నుంచీ చిన‌బాబును బ‌రిలోకి దించే అవ‌కాశం ఉంద‌ట‌. ఎన్నిక‌ల్లోపు నియోజ‌క వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే మారొచ్చేమోగానీ, లేదంటే అదే నియోజ‌క వ‌ర్గం నుంచి లోకేష్ ను పోటీ పెట్టేందుకు చంద్ర‌బాబు ఆస‌క్తి చూపుతున్న‌ట్టు స‌మాచారం.  


ఇంతకంటే సేఫ్ ప్లేస్ అసలు ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడా లేదు అనేది చంద్రబాబు ఆలోచన. రాబోయే ఎన్నికల్లో హిందూపురం కాకుండా బాలయ్య బాబు ని మరొక ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గా దింపే ప్రోగ్రాం పెట్టారని కూడా టాక్ వినిపిస్తోంది. హిందూపురం నుంచి ఎందుకు మార్చుతున్నారంటే… అక్క‌డ రాజ‌కీయ ప‌రిస్థితులు రానురానూ టీడీపీకి ప్ర‌తికూలంగా మారుతున్నాయ‌నే అంచ‌నాలున్న‌ట్టు స‌మాచారం! గెలిచిన తరవాత బాలయ్య బిజీ గా సినిమాల్లో ఉండడం , టీడీపీ మీద నెగెటివ్ ఇంపాక్ట్ చూపించేలా ఉందట.అయితే గుడివాడ లో కోడలి నాని కి చెక్ పెడుతూ బాలకృష్ణ అక్కడ నిలబడే అవకాశాలు ఉన్నాయి 



మరింత సమాచారం తెలుసుకోండి: