banks lockers customers కోసం చిత్ర ఫలితం

బాంక్ లాకర్ల విషయంలో బాంకులు నిర్లక్ష్య రహిత బాధ్యత తో వ్యవహరించటం తప్ప,  ప్రకృతి సంబంద వైపరీత్యాల్లోను, దొంగతనం, దోపిడీల ద్వారా లాకర్ లకు అందు లోని వస్తువులు పోవటం జరిగితే బాంకులు ఏ రకంగాను  ఎలాంటి బాధ్యత తీసుకోవు.  అంతేకాదు ఏ రకమైన ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఉందవని ఆర్.బి.ఐ. 19 పబ్లిక్ సెక్టర్ బాంకులు సమాచార హక్కు చట్టం క్రింద అడిగిన ప్రశ్నకు సమాదానంగా వెల్లడించాయి. 

banks lockers customers కోసం చిత్ర ఫలితం

   

ఇంట్లో ఉన్న బంగారం, విలువైన వస్తువులను దాచుకునేందుకు ఎక్కువమంది ఆశ్రయించేది బ్యాంకు లాకర్లనే. అక్కడైతే తమ డబ్బు క్షేమంగా ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఆ లాకర్లు చోరీకి గురైతే నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత బ్యాంకులకు లేదట. సమాచార హక్కు చట్టం ద్వారా రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)తో పాటు 19 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ చేదు నిజాన్ని వెల్లడించాయి.

banks lockers customers కోసం చిత్ర ఫలితం


ఇటీవల లాకర్‌ సేవలను అందించే విషయంలో బ్యాంకులు అనుసరిస్తున్న పద్ధతులపై "కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా-(సీసీఐ)" ఆరోపణలు చేసిన నేపథ్యంలో కుష్‌-కల్రా అనే న్యాయవాది సమాచార హక్కు చచట్టం ద్వారా బాంకులను ఆశ్రయించారు. ఆర్‌బీఐ ఇచ్చిన సమాధానం చూసిన ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారట. ఇదే విషయాన్ని సీసీఐకి ఆయన నివేదించారు.


banks lockers customers కోసం చిత్ర ఫలితం

ఖాతాదారుడు నష్టాన్ని అంచనా వేయడానికి ఆర్‌బీఐ నుంచి ఎలాంటి మార్గ నిర్దేశం కానీ, పరిమితులు కానీ లేవని సీసీఐకి తెలిపారు. లాకర్‌కు సంబంధించి బాధ్యత విషయంలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు చేతులు దులిపేసుకున్నాయని అన్నారు. ఈ విషయంలో మొత్తం 19 బ్యాంకులు ఒకే విధంగా స్పందించాయని సదరు న్యాయవాది తెలిపారు. 

banks lockers customers కోసం చిత్ర ఫలితం



లాకర్‌కు కేటాయింపునకు సంబంధించి ఖాతాదారులకు, బ్యాంకుల మధ్య సంబంధం  "భూస్వామి, కౌలుదారికి మధ్య ఉండే సంబంధాన్ని పోలి ఉంటుందని" చెప్పాయట. లాకర్‌లో ఉన్న విలువైన వస్తువుల బాధ్యత పూర్తిగా ఖాతాదారుడిదేనని బ్యాంకులు కేవలం లాకర్‌ను మాత్రమే కలిగి ఉంటాయని చెప్పడం గమనార్హం.


లాకర్‌ తీసుకునే సమయంలో కొన్ని బ్యాంకులు ఈ విషయాన్ని ఒప్పంద పత్రాల్లో స్పష్టంగా తెలుపుతాయట. లాకర్‌లో వస్తువులను తన పూర్తి ఇష్టంతోనే ఖాతాదారుడు దాచుకుంటున్నాడని అందులో పేర్కొంటాయట.


banks lockers customers కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: