mudragada chandrababu కోసం చిత్ర ఫలితం


గతకాలం రాజకీయాలు ఎలా సాగినా బలమైన "సామాజిక సమాచార వ్యవస్థ" అంటే సోషల్ మీడియా బలవత్తరంగా తయారై నప్పుడు చెప్పిన మాటలు చేసిన మాటలు ఆడిన బాసలు జనం మరచిపోరు. అంతే కాదు నేనా మాటలాడలేదన్నా ఆడియో లు, వీడియోలు ఆ సమాచారాన్ని బట్టబయలు చేసి కాలచక్రాన్ని కాసేపు వెనక్కి తీసుకెళ్ళి సినిమా చూపించగలదు. అందుకే కాపు ఉద్యమం ఎంత ఆలస్యమైనా ఎన్ని సార్లు మొదలెట్టినా అంతే బలంగా ముందుకు సాగేలా ఉంది.  


mudragada chandrababu కోసం చిత్ర ఫలితం


కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖాస్త్రం సంధిం చారు. కాపు రిజర్వేషన్లపై ఈసారి చావో-రేవో తేల్చుకుంటామని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే నెల 26నుంచి ముద్రగడ పద్మనాభం పాదయాత్ర జరిపితీరుతామని అన్నారు. ఈ సందర్భంగా "ఛలో అమరావతి" పేరుతో సోమవారం ఇక్కడ రూట్‌ మ్యాప్‌ విడుదల చేశారు. ముద్రగడ స్వంత గ్రామం కిర్లంపూడి నుంచి ఆయన తన యాత్రను ప్రారంభించ నున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లా మీదగా పాదయాత్ర కొనసాగనుంది.


mudragada chandrababu కోసం చిత్ర ఫలితం

 
ముద్రగడ లేఖ సంక్షిప్త సారాంశం ఏమంటే: 

"ప్రజలతో, బీసీ నేతలతో, చర్చించి 100 శాతం ఏకాభిప్రాయం తర్వాతనే రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని తమరు ఇటీవలే సెలవిచ్చారు. దేశమంతా పర్యటించి నిర్ణయం తీసు కుంటామని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. ఈ చిలుక పలుకులు ఎన్నికల ప్రచారసభల్లో మాట్లాడినప్పుడు, పార్టీ మేనిఫెస్టోలో రిజర్వేషన్ల అంశం పెట్టినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? బీసీల కోటాలో మాజాతికి వాటా ఇవ్వాలని అడగటం లేదు. ప్రత్యేక కేటగిరి కిందే రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. బీసీలకు అన్యాయం జరగకుండా రిజర్వేషన్‌ ఇస్తామని పదేపదే మాట్లాడుతున్నారు. మామద్య తగవులు తంపులు పెట్టి పబ్బం గడుపు కోవాలనుకోవడం మీకు అలవాటైంది. మూడేళ్లుగా రిజర్వేషన్లను డీఫ్రిజ్‌లో పెట్టి 2019లో మళ్లీ మావాళ్లతో ఓట్లు వేయించుకోవాలనే మీ కుట్రను తెలుసుకోలేనంత స్థితిలో ఇప్పుడు మాజాతి లేదు. కాపు రిజర్వేషన్లపై ప్రపంచవ్యాప్తంగా పర్యటించి ఏకాభిప్రాయానికి రండి. అప్పుడు మీ ఖ్యాతి ఖండాంతరాలు గా విరాజిల్లుతుంది" అంటూ.....

బ్రిటీష్ వాళ్ళు మన దేశం వదలి వెళ్ళినా వారి "విభజించు పాలించు" అనే గొప్ప సిద్ధాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తున్నట్లు నర్మగర్భంగా పేర్కొన్నారు.


mudragada chandrababu కోసం చిత్ర ఫలితం


ఐవైఆర్ విషయంలో చంద్రబాబు తీరు సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణులు కూడా తడాఖా చూపాలంటూ పిలుపు నిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు  ముద్రగడ లేఖలో పై విషయాలన్నీ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: