visa fee increase by India for USA UK UAE కోసం చిత్ర ఫలితం


ఈ మద్య అన్నీదేశాలు తమ వీసా ఫీజుల పెంపు, కఠినతరమైన నిబంధనల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. భారత్ సైతం ప్రపంచదేశాలకు అదేస్థాయి లో దీటుగా బదులివ్వాలని తలచింది తక్షణమే తమ ఫీజులు నిర్ణయించింది. ఈ మేరకు 'టిట్ ఫర్ టాట్ గా దెబ్బకు దెబ్బ' గా సమాధానం కూడా ఇస్తోంది. భారత్ ను సందర్శించే విదేశీయులకు వివిధ కేటగిరీ ల్లో వీసా పీజులను 50 శాతం పైగా పెంచేసింది.  


visa fee increase by India for USA UK UAE కోసం చిత్ర ఫలితం


తాత్కాలిక ఉద్యోగ విధులపై వచ్చే వారిపై కూడా ఈ ఫీజు పెంపును ప్రకటించింది. ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాలు ఇటీవల వీసాల విషయంలో కఠిన తరమైన నిబంధనలు తీసుకొస్తూ భారతీయులకు షాకిస్తున్నాయి. వారికి దీటైన సమాధానం ఇవ్వడానికే భారత్ సైతం వీసా ఫీజులను పెంచేసింది.  అమెరికా, కెనడా, యూకే, ఇజ్రాయిల్, ఇరాన్, యూఏఈ దేశస్తులకు వివిధ కేటగిరీల్లో భారత్ ఇప్పటికే ఫీజులు పెంచిన సంగతి తెలిసిందే.  

visa fee increase by India for USA UK UAE  కోసం చిత్ర ఫలితం

ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఏడాదికి వరకు ఇచ్చే పర్యాటక వీసాలకు ముందస్తు ఉన్న $100/-  డాలర్ల ఫీజును $ 153/- డాలర్లకు పెంచింది. అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం రూ. 6450/-  రూపాయల నుంచి రూ. 9868/-  రూపాయలకు పెరిగింది. 


ఏడాదికి పైగా, ఐదేళ్ల వరకు ఇచ్చే వీసాలపై కూడా $120/-  డాలర్లుగా ఉన్న ఫీజును $306/-  డాలర్లకు పెంచేసింది. అంటే ప్రస్తుతం ఈ వీసాలకు రూ. 19736/-  చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 


visa fee increase by India for USA UK UAE కోసం చిత్ర ఫలితం


ఈ వీసా పెంపులో కూడా ప్రభుత్వం కొన్నిమినహాయింపులు ఇచ్చింది. యూకే దేశస్తులకు మాత్రమే ఏడాదిపాటు ఇచ్చే పర్యాటక వీసాలకు ప్రస్తుతమున్న $162/-  డాలర్లను $248/-  డాలర్లకు మాత్రమే పెంచుతున్నట్టు తెలిపింది. ఐదేళ్లకు ఇచ్చే వీసాలకు కూడా $ 484/-  డాలర్ల నుంచి $ 741/-  డాలర్లకు పెంచుతున్నట్టు చెప్పింది.  



కెనడా,  ఐర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, థాయ్ లాండ్ దేశస్తులు ఉద్యోగవీసాలకు $ 300/-  డాలర్లకు బదులు ఇకనుంచి $ 459/-  డాలర్లు చెల్లించాలి.

visa fee increase by India for USA UK UAE కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: