ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు , తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇద్దరూ భిన్న ధ్రువాలు .. ఇద్దరి ఆలోచనా సరళి , స్టైల్ అంతా వేరుగా ఉంటుంది. ఇద్దరూ కలిసి రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేసిన తీరు ఏదైనా ఉందా అంటే అందులో పొలిటికల్ మైలేజీ ఉంటె ఖచ్చితంగా పని చేస్తారు. తెరాస రాజకీయం వేరు , టీడీపీ సంగతులు వేరు. ఒకవేళ ఒకే అంశం మీద ఇద్దరూ కలిసి నిలబడినా వారి లెక్కలు, ప్లాన్ లు , స్వార్ధాలూ వేరు వేరు అని అర్ధం చేసుకోవాల్సిందే.


తాజాగా రాష్ట్రపతి ఎన్నికల నేపధ్యం లో విడివిడిగా ఉన్నా కలసికట్టు తనం కనిపిస్తోంది. ఎన్డీయే ప్రవేశ పెట్టిన రాష్ట్రపతి అభ్యర్ధి రాం నాథ్ కోవింద్ కి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి లో ఇద్దరు చంద్రులూ కామన్ గా ఒకే అంశం మీద కేంద్రాన్ని కోరిక కోరారు . రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో మ‌ద్దతు ఇస్తున్న సంద‌ర్భంలో… తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన ఓ కీల‌క అంశంపై కేంద్రం పాజిటివ్ గా స్పందించేలా, త్వ‌ర‌గా చ‌ర్య‌లు తీసుకునేలా ఇద్ద‌రూ ప్ర‌య‌త్నించిన‌ట్టు క‌థ‌నం! ఆ ఉమ్మడి అంశం ఏంటయ్యా అంటే నియోజిక వర్గాల పునర్విభజన.


రాబోయే వర్షాకాల సమావేశం లో నియోజిక వర్గాల పునర్విభజన బిల్లు వచ్చేలా ఇద్దరూ తమతమ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే బోలెడంత లేట్ అయిపొయింది అనేది వారి బాధ. రాష్ట్రపతి అభ్యర్ధికి సపోర్ట్ ఇచ్చే టైం లోనే దీని గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు అని తెలుస్తోంది. ఈ ఇష్యూ ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యంలోనే పెండింగ్ ఉంద‌నీ, న్యాయ‌శాఖ నుంచి క్లియ‌రెన్స్ వ‌చ్చింద‌నీ, కాబ‌ట్టి ఇక‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ఒత్తిడి పెంచాల‌ని డిసైడ్ అయిన‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి.


అయితే జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రధాన మంత్రి తో ఎన్డీయే అభ్యర్ధిని సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించినప్పుడు జగన్ కూడా ఈ నియోజికవర్గాల పెంపు ఎంత త్వరగా వస్తే అంత మంచిదని చెప్పాడట. త్వరలో తానే ముఖ్యమంత్రిని అయ్యే చాన్స్ ఉంది అని విశ్వాసంగా ఉన్న జగన్ ఆ పెంపు తనకి ఫుల్ గా ఉపయోగపడుతుంది అని లెక్కలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: