రాష్ట్రపతి అభ్యర్ధుల నామినేషన్ ప్రక్రియ కోసం వైకాపా కి ఆహ్వానం అందడం తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద చర్చ కి దారి తీస్తోంది. రాం నాథ్ కోవింద్ నాల్గవ సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు కార్యక్రమానికి హాజరు కావాలి అని బీజేపీ నుంచి ఏపీ ప్రతిపక్ష పార్టీ కి ఆహ్వానం అనడం మామూలు విషయం కాదు. ఎన్డీయే అభ్య‌ర్థిగా కోవింద్ ను భాజ‌పా ప్ర‌క‌టించ‌డం.. ఆయ‌న‌కి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులూ మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం తెలిసిందే.
రెండో సెట్ నామినేషన్ మీద చంద్రబాబు సంతకం తీసుకున్న సంగతి తెలిసిందే.


మరొక పక్క కెసిఆర్ తో కూడా సంతకం తీసుకున్నారు. నాలుగవ సెట్ కి వచ్చే సరికి వైకాపా కీ వారి పార్లమెంట్ సభ్యులకీ ఆహ్వానం వచ్చింది. ఏపీ లో బీజేపీ - టీడీపీ ప్రభుత్వం నడుస్తోంది. అంటే ఆ రెండు పార్టీల భాగస్వామ్యం తో ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. టెక్నికల్ గా చూస్తే ఏపీ లో బీజేపీ కి వైకాపా ప్రతిపక్ష పార్టీ అలాంటి టైం లో ప్రతిపక్ష పార్టీ ని ఆహ్వానించడం చాలా ఆశ్చర్యకరం.


రాష్ట్రపతి అభ్యర్ధి పేరు పెట్టగానే వైకాపా నుంచి విజయ సాయి రెడ్డి ఆయన్ని పర్సనల్ గా కలుసుకుని మరీ మద్దతు తెలిపారు. కోవింద్ నే ఆఖరికి ఓకే చేస్తారు అనేది జగన్ కి ముందుగానే తెలిసింది అన్నమాట. అవసరమైతే వైకాపా తో కూడా దోస్తీ కడతాం అనేది బీజేపీ తాజాగా ఇస్తున్న సంకేతమా ? రాష్ట్రంలో భాజ‌పా సోలోగా ఎద‌గాలంటే టీడీపీతో పొత్తు వ‌దులుకోవాల‌న్న అభిప్రాయం కొంత‌మంది ఏపీ క‌మ‌ల‌నాథుల్లో ఉంది. చంద్రబాబు ని వెనకేసుకుని రావడం కేంద్రం తగ్గించాలి అనేది లోకల్ వాళ్ళు చెప్పే మాట.



కేంద్ర మంత్రి వెంకయ్య ముఖ్యంగా చంద్రబాబు మీద అతి ప్రేమ చూపించడం వారికి నచ్చని విషయం. నెమ్మదిగా వైకాపా తో పొత్తు పెట్టుకుని ఏపీ లో తమ బలం పెంచుకోవాలని బీజేపీ చూస్తోంది అన్నట్టే ఉన్నాయి ఈ నిర్ణయాలు అన్నీ.


మరింత సమాచారం తెలుసుకోండి: