bipin rawat about india china war & pakistan కోసం చిత్ర ఫలితం


చైనా, పాక్‌తో పాటు భారత్‌ అంతర్గతంగా ఎదుర్కొంటున్న ఉగ్రవాద ముప్పు పై ఒకే సారి యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నా మన్న భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యలపై చైనా మండి పడింది. యుద్ధం గురించి గగ్గోలు పెట్టడం ఆపాలని సూచించింది. అటువంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ వు ఖియాన్ పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా చైనా మరోసారి తన నోటి దురదను బయటపెట్టింది. 1962 చైనాతో యుద్ధం లో భారత్‌ పొందిన పరాభవాన్ని తమ గతాన్ని మరిచిపోకుండా మెదలాలని, వెంటనే సిక్కింలోని డాంగ్‌లాంగ్‌ ప్రాంతం నుంచి తన సైనికులను విరమించు కోవాలని హెచ్చరించింది. లేదంటే ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యల విషయం లో జరగాల్సిన చర్చలపై ముందుకు వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. గురువారం మీడియాతో మాట్లాడుతూ భారత సైనికులు సరిహద్దులు దాటి చైనా భూభాగంలోకి చొర బడ్డారని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా మీడియా సమక్షంలో ప్రదర్శించారు.


bipin rawat about india china war & pakisthan కోసం చిత్ర ఫలితం


సరిహద్దులో ఉన్న భారత సైన్యాన్ని ఉన్నపలంగా విరమించుకోవాలని కోరుతున్నాం. మున్ముందుకు ఎలాంటి అర్థవంతమైన చర్చ జరగాలని భావిస్తున్నా మేం ముందస్తు గా పెడుతున్న షరతు ఇదే. దీంతోపాటు భారత్‌ గత చరిత్ర నుంచి ఎంతో నేర్చు కోవాలి’ అంటూ 1962 భారత్‌-చైనాకు మధ్య జరిగిన యుద్ధాన్ని పరోక్షంగా గుర్తు చేశారు.


ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి చరిత్ర చెప్పిన పాఠాల గురించి తెలుసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, సిక్కింలోని డోంగ్‌లాంగ్ ప్రాంతంలో ఇరు దేశాల దళాలు మోహరించడంతో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సందర్శించి పరిస్థితులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ఒకేసారి అటు పాక్, ఇటు చైనాతో యుద్ధం చేసేందుకు సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.


bipin rawat about india china war & pakistan కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: