vanajakshi chintamaneni కోసం చిత్ర ఫలితం


ఒక అధికారి అదీ మహిళపై చేయి చేసుకోవటం ఎమెలే అయివుండి సంస్కృతి సంస్కారం మరచి అమానవీయంగా ప్రవర్తిం చటం చింతమనేని ప్రభాకర్‌ ఆయన అనుచరులు క్షమార్హులు కారు. ఒకవేళ డి.వనజాక్షి తప్పుచేస్తే ఆమెపై చట్టపరమైన చర్య లకు ఉపక్రమించవచ్చు. అందులోనూ శాసనసభ సభ్యుడుకదా!  ఇలాంటి నేరగాళ్లపై స్పందించి వాళ్ళపై చర్యలు తీసుకోక పోగా తహసీల్దారు డి.వనజాక్షి  "గీత దాటిందా? గీత దాటలేదా?" అని శల్యపరీక్షల ప్రభుత్వ పక్షపాతం, కులప్రీతి ఏనాటికీ క్షంతవ్యం కాదనే ప్రజలు అంటున్నారు. అనుమానం లేదు చింతమనేని "ఇసుక మాఫియా డాన్" అనే ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. 


కృష్ణాజిల్లా ముసునూరు తహసీల్దారు డి.వనజాక్షి లక్ష్మణరేఖ పరిదిలోనే పనిచేశారని గీత దాటలేదని ద్విసభ్య కమిటీ తేల్చింది. ముసునూరు మండలం తమ్మిలేరులో ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో మండల ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ హోదాలో వెళ్లి అడ్డుకు న్నందుకు ఆమె దాడికి గురైన విషయం విదితమే. 


vanajakshi chintamaneni కోసం చిత్ర ఫలితం


చింతమనేని పె చర్యలు తీసుకునే వరకూ ఆందోళన చేస్తామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం హెచ్చరించడంతో సీఎం చంద్ర బాబు వారిని పిలిపించి మాట్లాడి విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో వారు అదే షరతుగా పెట్టి ఆందోళన విరమించారు. దీంతో ప్రభుత్వం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేయక తప్పింది కాదు. 


రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జగదీష్‌ చంద్ర శర్మ, ఐఏఎస్‌ అధికారి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌లతో కూడిన ద్విసభ్య కమిటీ ఈ అంశంపై విచారణ జరిపింది. నివేదిక రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) దినేష్‌ కుమార్‌కు సమర్పించింది. దీనిని సీఎస్‌ ముఖ్యమంత్రికి పంపించారు.


విశ్వసనీయ సమాచారం ప్రకారం నివేదికలోని వివరాలేమంటే ఇసుక అక్రమ తవ్వకాలను వనజాక్షి  అడ్డుకున్న "తమ్మిలేరు ప్రాంతం ముసునూరు తహసీల్దారు పరిధిలోకే వస్తుంది. తహసీల్దారు తన పరిధికి చెందని ప్రాంతంలోకి వచ్చి అనవసర రాద్ధాంతం చేశారని  చింతమనేని  చేసిన వాదనలో నిజం లేదు"  చింతమనేని తన అనుచరుల ను తీసుకెళ్లి దాడికి దిగడం తప్పు. అలాగే వనజాక్షి కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నట్లు వ్యవహరించి ఉండరాదు. పోలీసులకు, ఉన్నతాధికారుల కు ఫిర్యాదుచేసి చర్యలు తీసుకుని ఉండాల్సింది. విప్‌ చింతమనేనిదే ఎక్కువ తప్పు ఉన్నట్లు తేలినందున ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.


vanajakshi chintamaneni  కోసం చిత్ర ఫలితం

చింతమనేని బాధ్యత కలిగిన శాసనసభ్యుడు. ఇసుక్ దందా ద్వారా వనజాక్షి అధికారాన్ని అడ్డుకున్నందుకు, అందునా ఒక మహిళపై చేయి చేసుకున్నదుకు సంశయం లేకుండా నేఱగాడని చెప్పవచ్చని ప్రజలు విఙ్జులు నిర్ద్వందంగా చెప్పుకుంటున్నారు. ఇక బాల్ ముఖ్యమంత్రి కోర్టులో పడింది. అయితే వస్తున్న వార్తల ప్రకారం వనజాక్షి పై బదిలీ ద్వారా చర్యలు తీసుకుంటానికి రంగం సిద్దమైందని ఆమెపై 'ఎస్సి అట్రాసిటి కేసు' కూడా పెడుతున్నారని తెలుస్తుంది.


"వనజాక్షి కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నట్లు వ్యవహరించి ఉండరాదు. పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసి చర్యలు తీసుకుని ఉండాల్సింది"  అన్న ఒక్క కారణం చూపి ఆమెపై ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు చెపుతున్నారు.  అయితే అత్యంత ప్రమాదకర ఇసుకదందా డాన్ నేరగాడు, ప్రభుత్వ విప్, శాసన సభ్యుడు, ఒక మహిళా అధికారిపై చేయి చేసుకున్న నేరగాని పై మాత్రం ఏ విధమైన చర్యలు తీసుకుంటారో మాత్రం ఇంకా సిద్ధం చేయలేదు.  

మరోసారి ఒక "అవినీతి రౌడీ ఎమెల్యే కోసం ప్రజాస్వామ్యం ఏపిలో హతః"  అనే వినిపిస్తుందట దగ్గరుండి చూసిన వాళ్ళకి.  అంతర్జాలం లో పోస్ట్స్ ఫార్వార్డ్ చేసిన నేరానికి అనుభవశీలి ఐవైఆర్ కృష్ణారావు పదవి పీకేసిన ప్రభుత్వం చింతమనేనిపై చర్య తీసుకోకపోతే ఎ ప్రభుత్వం కులగజ్జి, బందుప్రీతి, అనుచరప్రీతి లాంటి ప్రమాదకర జబ్బులతో కునారిల్లుతుందని మరోసారి ఋజువౌతుంది.  

vanajakshi chintamaneni  కోసం చిత్ర ఫలితం

కలకంఠి కంట కన్నీరు ఒలికింది ఇక తెలుగుదేశానికి చింతమనేనికి మిగిలేది పతనమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: