Image result for america india japan strategic defence alliance


అటు ఉత్తర కొరియా ఇటు సిక్కిం వద్దగల "త్రి కూడలి" వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయములోనే మలబార్‌ విన్యాసాల పేరుతో "అమెరికా, భారత్‌, జపాన్‌" ల నావికాదళాలు నిర్వహిస్తున్న సందర్భం యాదృచ్చికమే. అయితే ఈ కసరత్తులు చైనాకు ఒక సమాధానమని అమెరికా కమాండర్‌ రియర్‌ అడ్మిరల్‌ విలియం బైర్న్‌ జూనియర్‌ అన్నారు. విన్యాసాలు జరుగుతున్న "ఐఎన్‌ఎస్‌ జలాశ్వ" లో మీడియాతో మాట్లాడుతూ, ఐదు రోజుల పాటు జరిగే మలబార్‌ విన్యాసాలు మూడు దేశాల మధ్య "వ్యూహాత్మక రక్షణ విధానం" మరింత ముందుకుకు తీసుకునే ప్రణాళికలో బాగమేనని ఆయన తెలిపారు. అయితే ఈ విన్యాసాలు ఈ మూడుదేశాల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.


యావత్‌ ప్రపంచానికి ఈ విన్యాసాలు ఒక సమాధానమని ఆయన అన్నారు. "భారత్‌, చైనా, భూటాన్‌ల సరిహద్దుల్లోని
"త్రి కూడలి" (ట్రై జంక్షన్‌) వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ నావికాదళ విన్యాసాలు కీలక ప్రాధాన్యతను సంతరించు కున్నాయి. అయితే  విన్యాసాలకు, ఉద్రిక్తతలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఒక ఏడాది ముందే వీటి నిర్వహణకు ప్రణాళిక రూపొందించామని భారత నావికాదళ అధికారులు స్పష్టం చేశారు. 


ఉత్తర కొరియాతోనూ సమస్య కొనసాగుతున్న తరుణంలో వీటిని నిర్వహించడంపై అమెరికా కమాండర్‌ మాట్లాడుతూ ప్రపంచంలో అనేక ప్రమాదకరపరిస్థితులు ఏర్పడివున్నాయని కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని నిర్వహించడం లేదని చెప్పారు.
ఈ విన్యాసాల్లో 95 యుద్ధవిమానాలు, 16యుద్ధనౌకలు, 2జలంతర్గాములు పాల్గొంటున్నాయి. గత రెండు దశాబ్దాలుగా అమెరికా-భారత నావికాదళాలు ప్రతి ఏటా వీటిని నిర్వహిస్తున్నాయి. కొంతకాలం క్రితం జపాన్‌ కూడా చేరింది. ఎలాంటి విపత్కర పరిస్థితులనయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకు వీలుగా విన్యాసాలను జరుపుతుంటారు.


Image result for ins jalashwa

మరింత సమాచారం తెలుసుకోండి: