తెలంగాణలో ప్రస్తుతం ఆ ఐపిఎస్ ఆఫీసర్ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. మోసగాళ్లకు సింహాస్వప్నంగా మారారు. మత్తుగాళ్లను చిత్తు చేస్తున్నారు. నకిలీలపైన ఉక్కుపాదం మోపుతున్నారు. ఆయననే ఐపిఎస్ అధికారి అకున్ సబర్వాల్. సినిమా పరిశ్రమను గజగజలాడిస్తున్న మొనగాడు. మ‌త్తుగాళ్ల మ‌త్తు వ‌దిల్చే ప‌నిలో దుమ్మురేపుతున్నాడు. 


సీన్ క‌ట్ చేస్తే.. ఈమె స్మిత స‌బ‌ర్వాల్. తెలంగాణలో డైనమిక్ ఆఫీసర్. కలెక్టర్ గా ఆమె పనితీరును గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమించారు. త‌న టాలెంట్‌కు త‌గ్గట్టు తెలంగాణ ప్ర‌భుత్వంలో కీల‌క బాధ్య‌త‌లు చూసుకుంటున్నారు ఆమె. 


ఒక‌రు ఐపీఎస్, మ‌రొక‌రు ఐఏఎస్. అకున్ సబర్వాల్-స్మిత స‌బ‌ర్వాల్ తెలంగాణ‌లో గ్రేట్ ఆఫీస‌ర్లుగా వెలుగుతున్నారు. చాలామందికి తెలియ‌ని విష‌య‌మేమిటంటే వీరిద్ద‌రు భార్య‌భ‌ర్త‌లు. అవును.. ఇద్ద‌రూ ఇద్ద‌రే. ప్ర‌భుత్వ‌ ఆఫీస‌ర్లుగా ఒక‌రినిమించి మ‌రొక‌రు ప‌ర్‌ఫెక్ట్ అనిపించుకుంటున్నారు. నిజానికి వీరిద్ద‌రిది ల‌వ్ మ్యారేజ్ కూడా కాదు. పెద్ద‌లు కుదిర్చిన వివాహ‌మే. అకున్, స్మితా దంపతులకు ఒక పాప ఒక బాబు ఉన్నారు. మొత్తానికి ఈ జంట త‌మ స‌త్తాతో  ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: