Image result for jbp more french historian


నేతాజి సుభాష్ చంద్ర బోస్ మరణం పై అనుమానాలు వీడలేదు. ఈ విషయమై భారత ప్రభుత్వాలు నియమించిన మూడు కమిటీలు కూడా సమగ్రంగా ఆయన మరణాన్ని దృవీకరించలేదు. ప్రజల్లో ఆయన ఇప్పటికె బ్రతికే ఉన్నారన్న నమ్మకం ఉన్నవారు అనేకులు. అయితే నేతాజీ 1945, ఆగస్టు 18న విమానం ప్రమాదంలో చనిపోలేదు అని ఫ్రెంచ్ సర్వీస్ సీక్రెట్ డాక్యుమెంట్‌ స్పష్టంచేస్తోంది అని  జేబీ ప్రశాంత్  మోరె  పుదుచ్చేరి కి చెంది ఇప్పుడు పారిస్ లో నివసిస్తున్న ఒక అంతర్జాతీయ చరిత్రకారుడు తెలిపారు. అంతేకాకుండా విమానం ప్రమాదంలో నేతాజీ మృతిచెందారనే విషయాన్ని కూడా అప్పటి ఫ్రెంచ్ ప్రభుత్వం ఎక్కడా ధృవీకరించలేదని మోరె వివరించారు.


స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ ఎలా చనిపోయారు?  అని తెలుసుకునేందుకు భారత ప్రభుత్వం ఇప్పటివరకు మూడు కమిషన్లని నియమించింది. 1956లో ఏర్పడిన షా నవాజ్ కమిటీ, 1970లో ఏర్పడిన ఖోస్లా కమిషన్,  "సుభాష్ చంద్రబోస్ 1945లో ఆగస్టు 18న జపాన్ ఆక్రమణలో వున్న తైహోకు ఎయిర్ పోర్టు వద్ద జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు"  అని నివేదిక ఇచ్చాయి.


Image result for jbp more french historian'1999లో



ఏర్పాటైన ముఖర్జీ కమిషన్ మాత్రం అందుకు భిన్నంగా నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు' అని తేల్చిచెప్పింది. కానీ భారత ప్రభుత్వం ముఖర్జీ కమిషన్ ఇచ్చిన నివేదికతో ఏకీభవించలేదు. ముఖర్జీ కమిషన్ లేవనెత్తిన సందేహాలు ఆ తర్వాత ఎందరో స్కాలర్స్ బుర్రని తొలిచేశాయి. అందుకే ఎందరో స్కాలర్స్ ఇప్పటికీ నేతాజీ మరణం వెనుకున్న మిస్టరీని తెలుసుకు నే ప్రయత్నం చేస్తూనే వున్నారు.


ఇదిలావుండగా తాజాగా ప్యారిస్‌కి చెందిన జేబీపీ మోరె అనే ఓ చరిత్రకారుడు మరో పురాతన రహస్య నివేదికతో నేతాజీ డెత్ మిస్టరీని వార్తల్లోకి తీసుకువచ్చారు. ఫ్రాన్స్ నేషనల్ ఆర్కైవ్స్‌లో లభ్యమైన ఓ సీక్రెట్ రిపోర్ట్ ప్రకారం నేతాజీ 1945లో చనిపోలేదని.. 1947లో డిసెంబర్ 11 వరకు ఆయన బతికే వున్నారని మోరె స్పష్టంచేశారు. నేతాజీ 1945, ఆగస్టు 18న విమానం ప్రమాదంలో చనిపోలేదు అని ఫ్రెంచ్ సర్వీస్ సీక్రెట్ డాక్యుమెంట్‌ స్పష్టం చేస్తోంది అని తెలిపారు. అంతేకాకుండా విమానం ప్రమాదంలో నేతాజీ మృతిచెందారనే విషయాన్ని కూడా అప్పటి ఫ్రెంచ్ ప్రభుత్వం ఎక్కడా ధృవీకరించలేదని మోరె వివరించారు.


(J.B.Prashant More is a historian of international repute. He was born in Pondicherry on 28th August 1955. He studied at St.Joseph of Cluny school and Petit Seminaire, Pondicherry. After obtaining a bachelor's degree from Tagore Arts College, Pondicherry, he proceeded to France for higher studies. He obtained a Ph.D in History at the renowned Ecole des Hautes Etudes en Sciences Sociales, Paris. He is member of the Institute for Research in Social Sciences and Humanities. After facing several setbacks in his scholarly pursuit, he took to writing history}

మరింత సమాచారం తెలుసుకోండి: