ఈ నెల 26 న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నిర్వహించ బోతున్నారు అన్న సంగతి తెలిసిందే. దీనికి అనుమతులు లేవు అంటూ డీజీపీ సాంబ శివరావు చెప్పారు కూడా. విజయవాడ లోని పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మళ్ళీ మాట్లాడుతూ అప్పటి తుని ఘటన ని గుర్తు చేసారు.


ఎదో ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్న వ్యక్తి లాగా ఆయన మాటలు సాగాయి. శాంతి భద్రతలు పరిరక్షించడం కోసం నిబంధనలు పెడతాం అనీ వాటిని ఉల్లంఘించే వారి ని చూస్తూ ఊరుకోము అని డీజీపీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ముద్రగడ యాత్ర కి పర్మిషన్ లేనే లేదు అంటున్న డీజీపీ కాపుల‌ రిజ‌ర్వేష‌న్ల‌పై ప్ర‌భుత్వ ప‌రిధిలో క‌స‌ర‌త్తు జరుగుతోంద‌ని డీజీపీ చెప్పారు. ఈ విష‌య‌మై కాపు సోద‌రులు కాస్త ఓపిగ్గా ఉండాల‌నీ, ఉద్య‌మాల పేరుతో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించేలా రోడ్ల‌పైకి రావొద్ద‌ని కోరారు.


ఈయన మాటలు చూస్తుంటే ఎవరో టీడీపీ హెడ్ మాట్లాడుతున్నట్టు ఉంది కానీ డీజీపీ అనే ఫీలింగ్ రావడం లేదు. " నేను కాపులకి వ్యతిరేకిని కాదు. గత అనుభవాలు మనం మర్చిపోకూడదు తుని రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ పై దాడి చెయ్య‌డం, రైళ్ల‌పై రాళ్లు రువ్వ‌డం, రైలు బోగీల‌కు నిప్పుపెట్ట‌డం, మీడియా ప్ర‌తినిధుల‌పై దాడులు చేయ‌డం ఇవన్నీ మన చూసాం అలాంటివి మళ్ళీ జరగకూడదు. దాదాపు ఎనభై కోట్ల మేరకు ఆస్తి నష్టం జరిగింది ఆ రోజు " అంటూ డీజీపీ మాట్లాడారు . సరిగ్గా ముద్రగడ కొత్త ఉద్యమం లేవదీస్తున్న టైం లో తుని సంఘటన మీద చార్జ్ షీట్ దాఖలు చేస్తామని డీజీపీ ప్రకటన చెయ్యడం చర్చనీయంశం గా మారింది. టీడీపీ నేత మాట్లాడినట్టు డీజీపీ కాపు సోదరులు అంటూ , ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అంటూ మాట్లాడడం భలే విన్ఘగా అనిపిస్తోంది అంటున్నారు జనాలు. ఆయన చేసేది మంచికే అయినా చెప్పేది మంచికే అయినా ప్రభుత్వం స్టైల్ లో కాకుండా పోలీస్ స్టైల్ లో చెబితే బాగుండేది అనేది విశ్లేషకుల అభిప్రాయం కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: