తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను త్వరలోనే మార్చే అవకాశాలున్న‌ట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత నుంచి రెండు తెలుగు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా ఉంటోన్న ఆయ‌న్ను మార్చేందుకు రంగం సిద్ధ‌మైనట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ప్ర‌క్రియ జ‌రుగుతోంది. ఈ ప్ర‌క్రియ ముగిసిన వెంట‌నే ఈ మార్పు ఉంటుంద‌ని స‌మాచారం. 

Image result for ap governor narasimhan

తాజాగా ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల నుంచి న‌ర‌సింహ‌న్ పేరు ఈ ప‌ద‌వికి వినిపించింది. అయితే న‌ర‌సింహ‌న్ మాత్రం గ‌వ‌ర్న‌ర్‌గా ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. గ‌తంలో ఆయ‌న ఇంటిలిజెన్స్ విభాగంలో ప‌నిచేశారు. దీంతో ఇప్పుడు ఆయ‌న్ను గ‌వ‌ర్న‌ర్‌గా త‌ప్పించి సెక్యూరిటీ వింగ్‌ లేదా ఇంటెలిజెన్స్‌ వ్యవహారాల్లో ఆయనకు ఏదో ముఖ్యమైన పదవి ఇవ్వనున్నట్లు తెలిసింది.
Image result for ap governor narasimhan
న‌ర‌సింహన్ అప్ప‌టి ఉమ్మ‌డి రాష్ట్రానికి 2010లో గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న ఇక్క‌డే గ‌వ‌ర్నర్‌గా ఉంటున్నారు. 2014లో రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న రెండు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా ఉంటున్నారు. ఇక ఇప్పుడు న‌ర‌సింహ‌న్‌ను మార్చితే రెండు తెలుగు రాష్ట్రాల‌కు వేర్వేరు గ‌వ‌ర్న‌ర్‌ల‌ను నియ‌మించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Image result for ap governor narasimhan

ఈ క్ర‌మంలోనే కర్నాటకకు చెందిన సీనియర్‌ నాయకుడు శంకర్‌మూర్తిని తెలంగాణ గవర్నర్‌గా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇక ఏపీకి ఎవ‌రిని తొలి గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మిస్తార‌న్న‌దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. చంద్ర‌బాబు డెసిష‌న్ మేర‌కే ఏపీ గ‌వ‌ర్న‌ర్ నియామ‌కం ఉండ‌నుంది. 
ఇక న‌ర‌సింహ‌న్ మాత్రం తాను గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగేందుకే...ఇంకా చెప్పాలంటే తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా ఉండేందుకే మొగ్గు చూపుతున్నార‌ట‌. వేరే ప‌ద‌వి ఇస్తామ‌ని చెప్పినా ఆయ‌న మాత్రం సుముఖంగా లేన‌ట్టు తెలుస్తోంది. అయితే కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు మాత్రం కేంద్రంలో కీల‌క ప‌ద‌వి ఇస్తామ‌ని ఆయ‌న్ను ఒప్పించిన‌ట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: