భారత్ – చైనా మధ్య కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిక్కింలోని డోక్లాం విషయంలో రెండు దేశాల మధ్య ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఈ ప్రాంతం తమదేనంటూ చైనా.., కాదు తమదేనంటూ భారత్ పంతాలకు పోతున్నాయి. దీంతో అక్కడ రెండు దేశాలకు చెందిన సైనిక బలగాలు మోహరించాయి. ఒకానొక దశలో సైనికుల మధ్య పరిస్థితి తోపులాటల వరకూ వెళ్లింది.

Image result for bharat china war

రెండు దేశాలకు పంతాలకు పోవడంతో పరిస్థితి తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన కలిగించేలా ఉన్నాయి. చైనా ఇప్పటికే పాకిస్తాన్ లో అణ్వస్త్రాలను మోహరించిందని, ఏ క్షణాన్నయినా వాటిని ప్రయోగించేందుకు సిద్ధంగా ఉందని ములాయం చెప్పారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. భూటాన్, సిక్కింలను పరిరక్షించుకోవాల్సిన అవసరం భారత్ కు ఎంతనా ఉందన్నారు. అదే సమయంలో చైనా మాత్రమే మనకు శతృవని, పాకిస్తాన్ కాదని స్పష్టం చేశారు.

Related image

ములాయం వ్యాఖ్యలను అటుంచితే.. డోక్లాం విషయంలో చైనా మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది. టిబెట్ పర్వత ప్రాంతాలకు చైనా సైన్యాన్ని పెద్ద ఎత్తున తరలిస్తోంది. భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా పంపిస్తోంది. ఉత్తర టిబెట్ లో ఇప్పటికే లైవ్ ఫైర్ ఎక్సర్ సైజులను పూర్తి చేసిన చైనా.. పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమవుతోందని ఆ దేశ మిలిటరీ అధికార పత్రిక పిఎల్ఏ డెయిలీ ప్రచురించింది. దీంతో చైనా యుద్ధ సన్నాహాలు నిజమేనని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.


మరోవైపు భారత్ కూడా డోక్లాం దగ్గర రోడ్డు నిర్మాణానికి అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. భారత్ కూడా ఇప్పటికై ఓ మోస్తరు సైన్యాన్ని మోహరించింది. అవసరమైతే మరిన్ని సైనిక బలగాలను మోహరించేందుకు కూడా సిద్ధమేనంటోంది. డోక్లాం వద్ద రహదారి నిర్మాణం భద్రత పరంగా తమకు అత్యంత ఆందోళన కలిగించే విషయని భారత్ చెప్తోంది. అయితే రెండు దేశాలు సరిహద్దు సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: