భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఆధార్. దేశంలో అమలవుతున్న అన్ని పథకాలకు ఆధార్ ను అనుసంధానం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వృధాను, అవినీతిని అరికట్టేందుకు ఆధార్ ను ప్రధాన ఆయుధంగా మలచుకుంటోంది. ఉపాధి హామీ పథకం, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, పాస్ పోర్టు, మొబైల్ సిమ్, గ్యాస్ కనెక్షన్.. ఇలా ప్రతి దానికీ ఆధారే ఆధారం. ఆధార్ లేకుండా ఏదీ తీసుకోలేం.. ఇవ్వలేం.

Image result for aadhar

ప్రభుత్వ నియమాల ప్రకారం ఆధార్ లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో.. పౌరులందరూ ఆధార్ కాపీని వెంట తీసుకెళ్లాల్సి వస్తోంది. అయితే అన్ని సందర్భాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. అందుకే మొబైల్ ఆధారిత ఆధార్ ను తీసుకొచ్చింది ప్రభుత్వం. ‘ఎంఆధార్’ పేరుతో ప్రభుత్వం ఓ యాప్ ను రూపొందించింది. ప్రస్తుతం యాండ్రాయిడ్ మొబైళ్లలో ఈ యాప్ లభిస్తోంది. దీన్ని ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు మన ఆధార్ మన చేతుల్లో ఉన్నట్లే.

Image result for aadhar

అయితే ఈ ఎంఆధార్ ను ఇన్ స్టాల్ చేసుకోవడానికి మనం ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఈ నెంబరుకు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ – UIDAI ఓ మెసేజ్ పంపిస్తుంది. దాన్ని ఎంటర్ చేయడం ద్వారా మన ఆధార్ మన మొబైల్ తో అనుసంధానమవుతుంది. అప్పటి నుంచి బార్ కోడ్, QR కోడ్ ల సాయంతో మన ఆధార్ ను ఇతరులతో పంచుకోవచ్చు. ఈ వివరాలను మెయిల్ కూడా చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: