Image result for nehru, krishna menon, radhkrishnan


సిక్కిం సరిహద్దుల్లో డొక్లామ్‌ ప్రాంతంలో భారత్‌-చైనా సైన్యాల మధ్య  ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు చైనా మీడియా, అటు ఆ దేశ అధికారులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు చైనా మీడియా యుద్ధం తప్పదన్న రీతిలో రాతలు కొనసాగిస్తుండగా, ఈ ప్రతిష్టంభనకు దౌత్యపరమైన పరిష్కారం లేనేలేదని, బేషరతుగా భారత్‌ తన బలగాలను డొక్లామ్‌ నుంచి ఉపసంహరించుకోవాల్సిందేనని డ్రాగన్‌ బుసలు కొడుతోంది. 


"వెనక్కివెళ్లండి. లేదా యుద్ధ ఖైదీలుగా పట్టుబడండి. లేదంటే నిష్కారణంగా చచ్చిపోతారు" అంటూ భారత్‌ లో గతములో చైనా మాజీ రాయబారిగా అంటే ముంబై లో "చైనా కౌన్సెలర్ జనరల్" గా పనిచేసిన మాజీ చైనా రాయబారి, విదేశీ వ్యవహారాల నిపుణుడు "లియు-యౌఫా" సెంట్రల్‌ టెలివిజన్‌ ఇంగ్లిష్‌ చానెల్‌తో మాట్లాడుతూ యుద్దం జరగరాదను క్షేమంగా ఉండాలనుకుంటే భారట్ కు, భారత శానికులకు అల్టిమేటం గా ఈ వ్యాఖ్యలు చేశాడు.  ఆయన ఇచ్చిన మూడు అవకాశాలు.  


సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులు మరొక దేశం భూభాగంలోకి ప్రవేశించారంటే, వాళ్లు సహజంగానే ఆదేశపు శత్రువులు అవుతారు. అందుకు వారు మూడు పరిణామాలను, పరిస్తితులను చవిచూస్తారు. 

1. స్వచ్ఛందంగా వెనుకకు తగ్గడం, 
2. ఖైదీలుగా పట్టుబడటం,  
3. అప్పటికీ సరిహద్దు వివాదం సమసిపోకపోతే, ఆ సైనికులు చంపపడొచ్చు అని ఆయన చెప్పుకొచ్చాడు.


ఈ మూడు ఆప్షన్లలో భారత్‌ ఏది ఎంచుకుంటుందో చైనా వేచి చూస్తున్నదని, భారత్ అర్థవంతమైన సున్నితమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటుందని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఆయన భాషణ మనకెంతో అవమానం కలిగించినంది. దానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే భారత్ యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలి. 


చైనా తన దేశ సరిహద్దులకు చిన్న చిన్న పిల్లలు రెఖలు గీసినట్లు సరిహద్దురేఖలు చిత్రిస్తుంది. తన దేశ సరిహద్దులను తన కు తగినట్లు అంతర్జాతీయ భూబాగాలపై తను నిర్మించతలపెట్టిన మహా నిర్మాణలకు అను కూలంగా పవర్, డిఫెన్స్, రోడ్-వేస్ ప్రొజెక్ట్స్ ను అంతర్జాతీయ  ఇన్-ఫ్రా-ప్రోజెక్ట్స్ గా చూపిస్తూ సరిహద్దు రేఖలను మార్చివేస్తుంది.


Image result for indo chini war


తన దేశ సార్వభౌమత్వ పరిరక్షణ అంటూ పొరుగుదేశాలను తన దేశంలో కలిపేసుకున్న చరిత్ర చైనాది. భారత దేశం స్వాత్రంత్రం పొందిన తొలినాళ్ళలో ప్పంచశీలపై సంతకం చేసి వెనుదిరిగిన భారత్ ను అక్కడే వెన్నుపోటుపొడిచిన నమ్మక ద్రోహి చైనా. అయితే పాతపగలు తీర్చుకోవటం కంటే చైనా పై పోరుకంటే తొలుతగా ఇల్లు పరిసరాలు చక్కబెట్టుకొని అంత ర్జాతీయంగా దౌత్య విజయం సాధించాలి. సమస్థ దేశాల సహకారం కూడగట్టాలి.    


సిక్కిం వివాదంలో భారత్‌ ఎలాంటి అసంబద్ధ విషయాలు చెప్పట్లేదని, ఈ విషయంలో ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతుగా ఉన్నాయని సుష్మా స్వరాజ్  చెప్పారు. సరిహద్దు వివాదం  "చైనా, భూటాన్‌" మధ్యే ఉన్నంతవరకు భారత్‌ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.  కానీ ఎప్పుడైతే అది  "భారత్‌-టిబెట్‌-భూటాన్‌ "  త్రి కూడలి  (ట్రై జంక్షన్‌)  వరకు వస్తుందో అది మన దేశ భద్రతపై  ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు.  రోడ్డు నిర్మాణంపై ఇప్పటికే  చైనాను పలుమార్లు  హెచ్చరించినట్లు తెలి పారు. ఈ సందర్భంగా మన విధానం లో తప్పు కనిపించదు. పలుమార్లు చైనా దేశ సరిహద్దులను మార్చుతూ మాపు లను చిత్రి స్తూ ఉంటూనే ఉంది. 


మన పొరుగుదేశం పాకిస్థాన్ లో చైనా ఇప్పటికే మందుపాతరలు నిర్మించాయని నాటి రక్షణ మంత్రి మూలాయం సింగ్ యాదవ్ పార్లమెంతులో చెప్పరు. అంతే కాదు ఆయన పలుమార్లు గత ప్రభుత్వాలను హెచ్చరించినట్లు కూడా చెప్పారు. కలలోనైనా, ఇలలోనైనా పాక్ భారత్ కు వీలైనంత అపకారమే చేస్తుంది అంతకు మించిన ఆలోచన దానికి లేకనే అది చైనా కాలనీగా మారిపోయింది. ఇప్పుడు మిగిలిన పొరుగు దేశాలను మనకు సహకరించే లా చేసుకోవాలి. ఇప్పటికే మన పొరుగు దేశాలకు చైనా ఆర్ధిక మరియు మౌలిక సదుపాయాలు సమకూర్చింది. ఆవిధంగా చైనా మన చుట్టు జల మార్గ రవాణా, వ్యాపార వ్యవస్థలను రక్షణ వ్యవస్థలుగా మార్చుకోవటం చిటికెలో పని. 


Image result for indo china war


భారత్ అతి బలహీనమని చెప్పలేము, కాని భారత్ యుద్ద సన్నద్ధత లేకనే 1962 లో చైనాతో ఓడిపోయింది. రక్షణ పరంగా విలువైన భూబాగాలను తన ఆదీనములోకి తీసుకుంది. అలాగే పాకిస్థాన్ కూడా చేసింది. నాటి భారత నాయకత్వ అసమర్ధత వలన పాక్ పై గెలిచినా రాజకీయ వ్యూహంలో ప్రదర్శించిన తెలివితక్కువతనం వలన ఆక్రమిత కాశ్మీర్ ఏర్పడింది. మనం సర్వం యుద్ద సన్నద్ధమేనా? అనేది ప్రధాన ప్రశ్న. అయితే మనకు యుద్ధాని కి సన్నద్ధం కావటానికి సమయం లేదు! ఇప్పటికే ఒక ప్రక్క చైనా అన్నీ అధికార సమాచార వ్యవస్థలు (మీడియా) చైనా ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నాయి. మరో ప్రక్క నేటి చైనా అధికార ప్రతినిధులు, రిటైర్డ్ దౌత్య వేత్తలు కూడా భారత్ ను బెదిరిస్తూ తమ ప్రభుత్వాన్ని యుద్ద సన్నద్ధం చేస్తున్నాయి. 


Related image


పాకిస్థాన్‌తో జరిగిన పెద్ద యుద్ధాలతో పోలిస్తే,  1962లో మనకూ చైనాకూ జరిగిన యుద్ధం పరిమాణంలో పెద్దది కాదు. రెండు పక్షాలలోనూ చెరో వెయ్యి మంది సైనికులను కోల్పోయింది. కానీ, చైనా చేజిక్కించుకున్న భూభాగం కానీ, సాధించిన విజయం కానీ ఎంతో పెద్దవి. ఎంతో గొప్పగా చెప్పుకున్న పంచశీల విలువలు, భారత్‌–చీనీ భాయీ భాయీ నినాదం విఫలమై, ఒక శత్రుత్వం నెలకొన్న సందర్భం అత్యంత సంక్లిష్టమైనది.


టిబెట్‌ను చైనా ఆక్రమించుకోవడం, దలైలామాకు భారత్‌ ఆశ్రయం ఇవ్వడం, సీఐఏ ఉనికికి భారత్‌ వేదికగా వ్యవహరించిందని చైనా భావించడం, అమెరికా– రష్యా మధ్య క్యూబన్‌ మిస్సైళ్ల సంక్షోభం జరిగే సమయంలోనే చైనా–భారత్‌ ఘర్షణ జరగడం – నాటి పరిణామాల వెనుక ఉన్న అంతర్జాతీయ కోణాన్ని సూచిస్తాయి. బ్రిటిష్‌ కాలం నాటి చారిత్రక సరిహద్దు వివాదం ఉన్నట్టుండి,  వర్తమాన ఘర్షణగా మారడం, భారత్‌ యుద్ధం లో చొరవ చూపడం, ఎంత దూరం చొచ్చుకుపోయిందో అంతకు రెట్టింపు దూరం వెనక్కు తగ్గవలసి రావడం– ఇవన్నీ వేర్వేరు కథనాలకు ఆస్కారమున్న అంశాలు.


"చైనా వంటి  ఒక సోషలిస్టు దేశం,  భారత్‌ వంటి ఒక  అలీన దేశం మీద దాడికి దిగదు"  అని నాటి రక్షణమంత్రి కృష్ణమీనన్‌ కూడా చివరిదాకా వాదిస్తూ వచ్చారు. యుద్ధపరిస్థితులు ముంచుకు వచ్చిన తరువాత,  భారత ప్రధాని  జవహర్లాల్ నెహ్రూ రక్షణ మంత్రిని పక్కన బెట్టి నేరుగా సైన్యాధిపతులతోనే వ్యవహరించడం మొదలుపెట్టారు. తగినన్ని సన్నాహాలు లేకుండా సాయుధ సంఘర్షణలోకి  దిగడం మీద అప్పటి రాష్ట్రపతి రాధా కృష్ణన్‌ కు కూడా చాలా అభ్యంతరాలు  ఉండేవని హెచ్చరించారని, మొత్తం మీద ఇండియా–చైనా యుద్ధం పరిణామాల మీద ఆయన అసంతృప్తి చెందారని అంటారు. 


అనుభవఙ్జుల వాదనల ప్రకారం భారత్ చైనాతో పొందిన ధారుణ ఓటమికి కారణం యుద్ధసనాహాలు లేకుండానే చైనాతో దౌత్యం వదిలేసి సాయుధ పోరాటం చేయటమే. దానికి మించి కమ్యూనిష్టుల్లా,  సోషలిష్ట్ చైనాను నమ్మి యుద్దానికి  దేశాన్ని ముందే సిద్ధం చేయలేని రక్షణమంత్రి కృష్ణ మీనన్ ధారుణ వైఫల్యం. అన్నిటికీ మించి పంచశీలను ప్రాతిపదికగా చైనాను పూర్తిగా నమ్మి యుద్ధసనాహాలు చేయటానికి సమయంలేని పరిస్థితుల్లో మరో అంతర్జాతీయ దౌత్యానికి ఆలోచన చేయకుండా విఙ్జుడైన రాష్ట్రపతి మాట పెడచెవిన పెట్టి చైనా తో సాయుధ పోరాటానికి దిగటం నాటి ప్రాధాని చేసిన ఘోర తప్పిదం.  


రాజకీయ నాయకత్వాన్ని బట్టే భారత విదేశసంబంధాలు నిర్మితమౌతాయి. అమెరికా అభిరుచితో కూడిన "నూతన ప్రపంచ వ్యవస్థ" పై బిజెపి నాయకత్వం లోని  ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఎక్కువ విశ్వాసం, నమ్మకం.  సిక్కిం సమీపంలోని ముక్కోణపు కూడలిలో చైనా నిర్మాణాలు భారతకు వ్యూహాత్మకంగా ప్రమాదకరమైనవే. ఆ కూడలికి భారత చెబుతున్న నిర్వచనంతో చైనా ఏకీభవించడం లేదు. చైనా దాన్ని భారత్ భూటాన్‌ తరఫున వకాల్తా పుచ్చుకొని వ్యవహరించడంగా చూస్తూ ఆ విధమైన ఆలోచనలు మానుకోవాలని భారతను హెచ్చరిస్తున్నది. 


Image result for nehru, krishna menon, radhkrishnan


ఈ సమస్యను మొదట దౌత్య స్థాయిలో నిష్కర్షగా, నిర్మొహమాటంగా, దౌత్య విఙ్జతతో పరిష్కరించే ప్రయత్నం చేయాలి. పరస్పర నమ్మకం, విశ్వాసం ఉంటే, ఒకరి భూభాగంలో మరొకరు ఇరుదేశాలకు ప్రయోజనకర వ్యవస్థలు నిరంఆనాలకు పూనుకున్నా ఏ యిబ్బంది, భయం కూడా ఉండదు. నమ్మకం లేని చోట, ఎన్ని కుడ్యాలు, పర్వతాలు, లోయలూ, అగడ్తలు నిర్మించుకున్నా ప్రయోజనము, ప్రశాంతత, శాంతి ఉండదు. అమీ తుమీ తేల్చుకునే ముందు, అన్ని అవకాశాలను అన్వేషించాలి. ఈ లోపు గా యుద్ధ క్రీడాభిమానులు రెచ్చగొట్టటాలు ఆజ్యాలు పోయటాలు మనటం మంచిది.


Image result for nehru, krishna menon, radhkrishnan


ప్రభుత్వం కూడా యుద్ధ సన్నత లేకుండా అన్నిటికీ ఏనాడో సిద్ధమైన చైనాతో యుద్ధాన్ని అభిలషించటం మంచిదికాదు. అలా జరగాలసి వస్తే ముందు పాకిస్థాన్ పీచమణచాలి అది సాధ్యమా?  మనం  రష్యాని పూర్తిగా నమ్మి అమూల్యమైన నాటి ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి ని కోల్పోయాం అన్నది మరవరాదు. పూర్తి నమ్మకం దౌత్యం లో గాని రక్షణ రంగం లో గాని వదిలేసి,  ప్రత్యామ్నాయాలు ఎప్పటికప్పుడు ఉండటం చాలా అవసరం అంటున్నారు యుద్ధ నిపుణులు.


ప్రస్తుత భారత్‌-చైనా ఉద్రిక్తతకు అంతర్జాతీయ కోణం కూడా  ఉన్నదంటున్నారు విఙ్జులు. ఏదో దేశానికో అంతర్జాతీయ ఆధి క్యత నివ్వటానికి లేదా నిలపటానికి భారత్ సమిధ అవ్వటం మంచిది కూడా కాదు. కాబట్టి చైనా - దానితో ఇంచుమించు సరి సమాన జనసంఖ్య ఉన్న భారత్ రెండూ విఙ్జత వదిలేస్తే మానవాళికే పెనుముప్పు సంభవించవచ్చు. ప్రపంచ జనాబాలో "36%"  జనాబా కలిగి ఉన్న "చైనా - భారత్ "లు విఙ్జతతో వ్యవహరించటం ఇరువురికి మంచిది. 


Image result for indo chini war

మరింత సమాచారం తెలుసుకోండి: