ఇప్పటి వరకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఏనాడూ లేని ఉత్కంఠ ఈ సారి ఎన్నికల్లో జరిగింది.  ఎన్టీఏ అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ పోటీ చేయగా..తన ప్రత్యర్థి, విపక్షాల అభ్యర్థి మీరాకుమార్ పోటీ చేశారు.  ఇరువురు తమ గెలుపు కోసం రాష్ట్రాల పర్యటన కూడా చేశారు.  ఈ రోజు రాష్ట్రపతి ఎన్నికల లెక్కింపు జరిగాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఎంపీల ఓట్ల లెక్కింపు పూర్తికాగా, ఆధిక్యంలో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  
Image result for ramnath kovind president
ఇక ఓట్ల లెక్కింపు ప్రకారం.. 4,79,594 ఓట్లు, మీరాకుమార్‌కు 2,04,594 ఓట్లు వచ్చాయి. ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, బీహార్‌ రాష్ట్రాల ఓట్ల లెక్కింపు పూర్తవగా, ఏపీ నుంచి రామ్‌నాథ్‌కు 27,189 ఓట్లు రాగా, మీరాకుమార్‌కు ఒక్కఓటుకూడా పడలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..రాష్ట్రపతి ఎన్నికలో రామ్ నాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు.
Image result for meira kumar president
తన ప్రత్యర్థి, విపక్షాల అభ్యర్థి మీరాకుమార్ పై ఆయన భారీ తేడాతో విజయం సాధించారు. భారత 14వ రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించబోతున్నారు. 65.65 శాతం ఓట్లను కోవింద్ గెలుచుకున్నారు. ఇక యూపీయే అభ్యర్థి మీరాకుమార్ కు 34.35 శాతం మాత్రమే వచ్చాయి. కోవింద్ కు 7,02,644 ఓట్లు, మీర్ కుమార్ కు 3,67,314 ఓట్లు పడ్డాయి.   


మరింత సమాచారం తెలుసుకోండి: