Image result for akun sabharwal with subbaraju


కెల్విన్ తో సెల్ఫీలే  సినీ నటుల కొంప ముంచాయా వారికి వారే సెల్ఫ్-గోల్ చేసుకున్నారా? మత్తు మందులు ఇవ్వడానికి వెళ్లినప్పుడు కెల్విన్ ఉత్సాహంగా వారితో సెల్ఫీలు దిగిన ఫోటోలు సంపాదించిన అధికారులు, ఇప్పుడు విచారణ సమయంలో చూపించి వాటికి సమాధానం చెప్పమంటున్నారు. కెల్విన్ ముఠాతో లింకులు లేవని వాదించిన పూరి జగన్నద్ కాని శ్యాం కే నాయుడు గాని చివరకు సుబ్బరాజు గాని సమాదానం చ్ప్పలేక తెల్ల ముఖం వేశారని సమాచారం దానితో ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. 


పలువురు సినీ ప్రముఖులకు డ్రగ్స్ ముఠాతో అతి దగ్గర సంబంధాలు ఉన్నాయని తెలియడంతో సిట్ అధికారులు వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు. కెల్విన్ ముఠాతో వారికి పరిచయం ఎలా ఏర్పడింది? డ్రగ్స్ ఎప్పటినుంచి వాడు తున్నారు? ఎవరెవరికి ఎవరెవరు సరఫరా చేస్తున్నారు? ఇలా సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 


Image result for shyam k naidu drugs case by sit in telangana


అయితే తమకు ఏ సంబంధం లేదని వారు చెబుతుండగా వారు కెల్విన్‌తో దిగిన సెల్ఫీలను చూపిస్తున్నట్లు తెలియ వచ్చింది. దీంతో వాళ్ల నోళ్లు మూతలు పడుతున్నాయని సమాధానం చెప్పలేక నీళ్ళు నములుతున్నట్లు సమాచారం. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్‌తో అనేక మంది సినీ ప్రముఖులు సెల్ఫీలు దిగినట్లు మాదకద్రవ్యలు వాటి సరపరా వ్యవహారాలు చూస్తున్న బృందానికి సిట్ దర్యాప్తులో వెల్లడైంది. 



సినీ తారలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ నుంచి తమదైన శైలిలో విచారించిన సిట్ ఎంతో విలువైన సమాచారాన్ని రాబట్టారు. కెల్విన్ మొబైల్ ఫోన్ నుంచి అనేక విషయాల తో కూడిన డేటాను పెద్ద మొత్తంలో ఇతర సమాచారాన్ని విచారణ ద్వారా వెలికి తీశారు. ముఖ్యంగా వాట్సప్ గ్రూపులు, వాటిలో జరిగిన సంభాషణలతోపాటు ఫోటోలు, వీడియోలను సిట్ అధికారులు సేకరించారు. ప్రస్తుత దర్యాప్తుకు ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి.


Image result for akun sabharwal with subbaraju



టాలీవుడ్ డ్రగ్ రాకెట్ కేసును విచారిస్తున్న సిట్ బృందం శుక్రవారం క్యారెక్టర్ నటుడు సుబ్బరాజుకు చుక్కలు చూపించినట్లు సమాచారం. మొదటి రెండు రోజులు  పూరి జగన్నాథ్, శ్యామ్ కె.నాయుడులను విచారించిన సిట్ అధికారులు, మూడో రోజైన శుక్రవారం సుబ్బరాజును విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. మిగతా ఇద్దర్లాగే సుబ్బరాజు ను కూడా అధికారులు కొంచెం ఎక్కువ సమయమే విచారించారు. దాదాపు 11 గంటల పాటు సుదీర్ఘంగా సుబ్బరాజును విచారించినట్లు సమాచారం.
కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ తో సుబ్బరాజు కున్న సంబంధాలపై అధికారులు ఆరాతీశారని, సుబ్బరాజుపై ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. అధికారుల ప్రశ్నల కు జవాబు చెప్పేందుకు సుబ్బరాజు ఇబ్బంది పడినట్లుగా సమాచారం. పూరి, శ్యామ్ లను వేర్వేరు బృందాలు విచారించగా, సుబ్బరాజును మరో బృందం  ప్రశ్నించింది. సుబ్బరాజు ఉదయం చెప్పిన దానికి, మధ్యాహ్నం చెప్పిన దానికి అసలు సంబంధం లేకపోవడంతో అధికారులకు అతడి తీరు అనుమానాస్పదంగా అనిపించినట్లు సిట్ వర్గాలు చెబుతున్నాయి. ఒక దశలో విచారణ ముగిసి, సుబ్బరాజు కిందికి దిగుతుండగా అధికారులు మళ్లీ వెనక్కి పిలిచి నేరుగా అకున్ సబర్వాల్ రంగంలోకి దిగి విచారించినట్లు సమాచారం. అకున్‌ ఎంట్రీతో సుబ్బరాజు విచారణకు సహకరిస్తున్నారన్నాడని సమాచారం. 


ఈ విచారణలో టాలీవుడ్‌ను కుదిపేసే విషయాలు బయటపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరికొందరి సినీ ప్రముఖుల పేర్లను నిర్దారించుకోవడానికి సిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సిట్‌ ఆఫీస్‌కు ఉస్మానియా వైద్యులు చేరు కున్నారు. ప్రస్తుతం సుబ్బరాజు శాంపిల్స్‌ వైద్యులు సేకరిస్తున్నారు. రక్తం, గోళ్లు, తల వెంట్రుకల నమూనాలను సేకరించి ఉస్మానియా వైద్యుల పర్యవేక్షణ లోని ఎఫ్ ఎస్ ఎల్ ల్యాబ్‌ కు తీసుకెళతారు.


 
అయితే విచారణలో ఇంకా కొందరి పేర్లు బయటికి వచ్చాయని, వారికి కూడా త్వరలో నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తోంది. "హైదరాబాద్‌లో 16 బార్లలో డ్రగ్స్‌ అమ్ముతున్నట్లు గుర్తించాం, రేపు బార్ల యజమానులతో సమావేశం నిర్వహిస్తామని" అకున్ సబర్వాల్ మీడియా కు తెలిపారు.  "విచారణకు అందరూ సహకరిస్తు న్నారని" ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు. శనివారం నటుడు తరుణ్ విచారణకు హాజరు కానున్నారని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: