Image result for roopa maudgil with tamil murasu


ఈ మద్య వి.ఐ.పి ఖైదీలు జైళ్ళ శాఖ ఉన్నతాదికార్ల నుండి జవాన్ల వరకు లంచాలను పంచుతూ, దేశమంతా సకల రాజభోగాలు రాజోచితంగా అనుభవించటం గురించి వింటూనే ఉన్నాం. కొందరు ఖైదీలైన గుండాలు జైళ్ళలో ఉండి తమ సెటిల్మెంట్లను నిరాటంకంగా నిర్వహిస్తూనే ఉన్నారని బయట తెలుస్తునే ఉంది. ఇలాంటి విషయాలు నిజాయతీపరురాలైన ఐపిఎస్ అధికారిని జైళ్ళ శాఖ డి.ఐ.జి., డి. రూప మౌడ్గిల్ ఉన్నతాధికారులకు పరిశీలించి పరిశొదించి లేఖ పంపటం తో ప్రజలు విని అర్ధం చేసుకునే విషయాలు అధికారికంగా యదార్ధాలని ఋజువయ్యాయి.


Image result for abdul karim telgi



పరప్పణ అగ్రహార జైలు అధికారులకు లంచం ఇచ్చి, అత్యంత విలాసవంతమైన జీవితం అనుభవించినట్లు రుజువైన పక్షంలో అన్నా-డీఎంకే (అమ్మ) ప్రధాన కార్యదర్శి శశికళకు మరికొన్నేళ్లు అదనపు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉందని జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప చెప్పారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో సంపాదనకు మించిన ఆస్తులు కలిగి ఉన్న నేఱం లో శశికళ, నకిలీ స్టాంపుల కేసులో అరెస్టయిన అబ్దుల్ కరీం తెల్గి తదితరులు ఖరీదైన సౌకర్యాలను జైలు అధికారులకు కోట్లాది రూపాయిలు లంచం యిచ్చి వారి ద్వారా అవకాశాలు కల్పించుకుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు రూప బయటపెట్టారు.


Image result for abdul karim telgi & Sasikala in parappaNa agrahar jail

Abdul Karim Telgi gets special treatment in Jail


ముఖ్యంగా శశికళ రూ.2 కోట్ల ముడుపులు ఇచ్చినట్లు జైళ్లశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి దేశవ్యాప్తంగా చర్చకు తెరదీశారు. కాగా, లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో అత్యున్నత స్థాయి జైళ్ళ శాఖ అధికారి డీజీపీ సత్యనారాయణరావు ను కర్ణాటక ప్రభుత్వం వెకెన్సి రిజర్వు (వీఆర్) కు పంపింది. అక్కడ పనిలేకుండానే జీతం తీసుకున్నా ఆ స్థాయి అధికారికి అది ధారుణ అవమానమే. అదే సమయంలో ఋజువర్తన కలిగి అత్యంత సమర్ధవంతమైన అధికారిణిగాపేరున్న  రూపను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేసింది.


Image result for abdul karim telgi & Sasikala in parappaNa agrahar jail



ఐపీఎస్ అధికారిణి రూప ఇటీవలే ఓ తమిళ పత్రిక "తమిళ్ మురసు" కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శశికళకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. "జైలులో ఆమె అనేక సౌకర్యాలు పొందుతున్నట్లు ఆధారాలు సేకరించాను, అసలు ఆమె జైలులోనే గడప కుండా సమీపంలోని ఒక క్వార్టరులో ఉండేవారని కూడా తెలుసు కున్నాను. ఈ విషయంలో ఆమెను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని ఉంటే చాలా తీవ్రమైన చర్య తీసుకుని ఉండేదాన్ని అని, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ ప్రస్తుతం నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. జైలులో రాజభోగాలు అనుభవవిన్చినట్లు ఋజువైన పక్షంలో ఆమెకు మరో ఏడేళ్లు శిక్షపడే అవకాశం ఉంది" అని రూప చెప్పారు.




ఇదిలా ఉండగా, రూప చేసిన ఆరోపణలపై విచారణకుగానూ కర్ణాటక ప్రభుత్వం రిటైర్డు అధికారి వినయ్ కుమార్ ను నియమించింది. హవాలా రూపంలో జైలు అధికారులకు రూ.2 కోట్లు అందాయనడానికి వినయ్కుమార్కు ఆధారాలు లభించినట్లు, ఈనెల 24వ తేదీన ఆయన తన తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం.


Related image

మరింత సమాచారం తెలుసుకోండి: