తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా డ్రగ్స్ కి సంబంధించిన వార్తలే హల్ చల్ చేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో మరో భారీ డ్రగ్స్ ముఠా అరెస్టు కావడంతో అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో సామాన్యులకు అంతు చిక్కడం లేదు. నేరెడ్‌మెట్‌‌లో ఐదుగురు సభ్యులు ఈ ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ముఠాలో నైజీరియన్లతోపాటు విజయవాడకు చెందిన ఓ అమ్మాయికి కూడా ఉండటం గమనార్హం.
Drugs racket: A girl among nigerian gang arrest
ఈజీ మనీ కోసం గత కొంత కాలంగా వీరు డ్రగ్స్ వ్యాపారంతో పాటు హైటెక్ వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  అరెస్ట్ అయిన నిందితుల నుంచి 700 ఎల్ఎస్‌డీ స్ట్రిప్స్, 20 గ్రాముల కొకైన్, 12 గ్రాముల బ్రౌన్ షుగర్, రూ.2 లక్షల నగదు, 2 ల్యాప్‌టాప్స్, 9 మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్ తరలించి ఇక్కడ డ్రగ్స్ యూజర్లకి సరఫరా చేస్తున్న ఈ ముఠాలో విజయవాడకి చెందిన ఓ యువతి కూడా సభ్యురాలిగా వున్నట్టు పీసీ తెలిపారు.
మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు
ఈ డ్రగ్స్ ముఠాలో సభ్యుడైన నైజీరియన్ వెల్ఫేరేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా మన దేశానికి వచ్చిన నైజీరియన్ యువత.. నగర శివార్లలో మకాం వేసుకుని ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.  కాగా, ఈ ముఠా సభ్యులను రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: