తెలుగు సినిమా కథానాయకి, అక్కినేని ఇంటి కాబోతున్న కోడలు , తెలంగాణ హాండ్లూం బ్రాండ్ అంబాసిడర్ సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలనే కాక చేనేత వస్త్రాల  అభిమానులను, ఆ రంగాన్ని ఊపేస్తోంది. 


"రెండు రోజుల క్రితం సమంత ట్విట్టర్‌లో తన తల్లి చీర కట్టుకుని దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ చేనేత పై యువతులకు పోటీ పెట్టి బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది అదేమంటే నవయువతులు గతం లో తమ తల్లి ధరించే చేనేత చీరను ఫ్యాషన బుల్ గా  చక్కనైన చీరకట్టులో కట్టుకుని ఫొటో దిగి దానికి "రివైవ్ హ్యాండ్‌లూమ్, వోవెన్ 2017" అనే పదాలను హ్యాష్‌ట్యాగ్‌ కు జోడించి పోస్ట్ చేయాలని సూచించింది. 


అలా వచ్చిన ఫొటోల నుంచి ఐదుగురిని ఎంపిక చేసి "తెలంగాణ స్కిల్డ్ ఆర్టిజాన్స్" ఆధ్వర్యంలో నిర్వహించున్న "వోవెన్-2017" ఫ్యాషన్-షో కు ఆహ్వానించనున్నట్టు పేర్కొంది. సమంత ట్వీట్ తెలుగు రాష్ట్రాల మహిళల్లో ఉప్పెనలాంటి పెను సంచలనమే రేపింది. యువతులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి "తమ తల్లి చేనేత చీరను అందంగా కట్టుకుని" ఫొటోలు దిగి పోస్ట్ చేస్తున్నారు. ఇది చేనేత వస్త్ర వ్యాపారాన్ని ప్రోత్సహించి చేనేత కారులకు పెద్ద ఊపునిచ్చేందుకు చాలా చక్కని కాన్సెప్ట్ దొరికిందని అని వాళ్ళు సమంతను వేనోళ్ళ కొనియాడుతున్నారు. 


Image result for cine star samanta, telangana  handloom promotion for revive handloom woven 2017


తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖమంత్రి కే తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా నటి సమంత ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. అత్యధికమంది అభిమానించి నాయకుడు కేటీఆర్‌ అని, ఆయన నిజమైన స్ఫూర్తి అని సమంత కొని యాడారు. భావి ఆశకిరణమైన ఆయన గురించి తెలియడం గౌరవంగా భావిస్తున్నట్టు సమంత పేర్కొన్నారు. సమంత ట్వీట్‌కు స్పందిం చిన కేటీఆర్‌.. మా చేనేత ప్రచాకకర్తకు ధన్యవాదాలు అంటు బదులిచ్చారు. ఆమె చూపిన శ్రద్ధ, అంకితభావం చేనేతకు కొత్త జీవాన్ని అందించాయని ప్రశంసించారు. వోవెన్‌2017 కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: