Image result for ram gopal varma tweet on excise dept for Drugs case



రాంగోపాల్ వర్మ మనందరికి తెలిసిన తేడా మనిషి. ఊరంతా ఒకదారైతే ఈ వర్మ గారి దారి మరొకటి. అందుకే ఆయన ఖర్మకొద్దీ ఎక్సైజ్ వాళ్ల చిక్కులో పడ్డాడు. సినీ సెలబ్రిటీలు సామాన్య జనులు మాత్రం కాదు. ప్రజల్లో వారికి ఒక ప్రత్యేక ఆదరణ ఉంది. దాన్ని వారు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సెలెబ్రిటి స్టాటస్ అనుభవించేవాళ్ళు అద్దల మెద్దాలో మేడలో ఉంటున్నట్లే. తప్పు చేస్తే రాళ్ళు పడి ఖేల్ ఖతం కావటం ఖాయం. విచారణకు హాజరవక ముందు తామెంతో నీతిమంతులమని చెప్పి డ్రగ్స్ తో తమకు సంబందమే లేదని చెప్పిన వాళ్ళు తమ కుటుంబ సభ్యులతో చెప్పించిన వాళ్ళు విచారణ తరవాత నీళ్ళునములు తూ బయటకు రావటమేమిటి? 


Image result for ram gopal varma tweet on excise dept for Drugs case


రాం గోపాల్ వర్మతో సహా సినీ పరిశ్రమ వారతా ఒకటి గమనించాలి వాళ్ళకు ప్రజల దృష్టిలో గౌరవం అపారం. దాన్ని అను క్షణం కాపాడుకోవాలి. ప్రజా జీవితాలపై వారి ప్రభావం అపారం అనంతం. అయితే ఈ విషయములో ఎక్సైజ్ శాఖ కూడా సరిగా ప్రవర్తించటం అవసరం. పాఠశాల కళాశాల విద్యార్ధుల పేర్లు బహిరంగపరచనవసరం లేదు కాని ఇతర రంగాల ప్రముఖుల పేర్లు అధికారులు, రాజకీయనాకులు వారి మేజర్ సంతానం పేర్లు బయటపెట్టటం వారు "సమానతవం పాటిస్తున్నరూ" అనే భావన ప్రజలందరికి కలిగించటం వారి ధర్మం.  

 
అయితే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కౌంటరిచ్చారు. "పూరీజగన్నాథ్, సుబ్బ రాజులను విచారించినట్లు 12 గంటల సేపు స్కూలు పిల్లలను విచారిస్తారా?" అంటూ ప్రసిద్ద దర్శకుడు రాం గోపల్ వర్మ ఇటీవల సోషల్‌మీడియా వేదికగా సిట్ అధికారులను ప్రశ్నించిన విషయం తెలిసిందే. 


అంతేకాదు ఎక్సైజ్ శాఖ పేరును ప్రచారం చేసుకోవడానికి సినిమావాళ్లను ట్రైలర్లు, టీజర్లుగా వాడుకుంటున్నారని ఆరోపించిన ఆ దర్శకునికి అకున్ సబర్వాల్ మీడియా సమావేశంలో గ్ట్టిగానే పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

 
స్కూలు పిల్లల పేర్లను బయటకు చెప్పే ప్రసక్తే లేదని అకున్ స్పష్టం చేశారు. వాళ్లు మైనర్లు కావడంతో పేర్లు చెబితే వాళ్ల జీవితాలు నాశనం అయిపోతాయని, వాళ్ల పేర్లు ఎందుకు బహిరంగ పరచాలని అకున్ సబర్వాల్ ప్రశ్నించారు. బాధిత పిల్లల తల్లదండ్రులను పిలిపించి చెబుతున్నామని, ఇక్కడకు రావడానికి అంగీకరించని తల్లిదండ్రు లకు ఫోన్‌లో కౌన్సెలింగ్ చేస్తున్నామని అకున్ సబర్వాల్ వివరించారు. చిన్న పిల్లల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పబోమని అకున్ సబర్వాల్ బలంగా చెప్పారు.


Image result for ram gopal varma tweet on excise dept for Drugs case

మరింత సమాచారం తెలుసుకోండి: