Image result for india america relations


చైనాకు భారత్ పై వైరం అభివృద్దిలో మాత్రమే ఉంటే మంచిదని యుద్ధం ద్వారా సాధించేది శూన్యమని, తాజాగా భారత్ అభివృద్ది వేగం చైనాను కుదిపివేస్తుంద్దని, అందుకే సరిహద్దులను ఆసరా చేసుకుని యుద్ధానికి చైనా భారత్ ను టార్గెట్ చేస్తూ రెచ్చగొడుతుందని అమెరికా రక్షణ శాఖ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. 


ప్రపంచంలో భారత్‌కు చారిత్రకంగా, సాంకేతికంగా పలు రంగాలలో ప్రత్యేక గుర్తింపు ఉన్నదని అందువల్లే అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన చాలా మంది ఇండియాకు ఎప్పుడూ తగిన గౌరవం ఇస్తూ వస్తున్నారని డాక్టర్ జోసఫ్ టీ.వైట్, ప్రెసిడెంట్ ఒబామా పరిపాలనలో రక్షణశాఖలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన రక్షణ శాఖ నిపుణుడు అన్నారు. 


భారత్ పట్ల అమెరికా ఎప్పుడూ సానుకూల వైఖరినే ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు. అందుకు ఇటీవల భారత ప్రధాని నరెంద్ర మోదీకి, అమెరిక ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గౌరవం చూస్తేనే ఈ విషయం అందరికీ అర్థమవుతుందని ఆయన అన్నారు.


ఇటీవల చైనాతో నెలకొన్న సందిగ్ధ పరిస్థితులను భారత్ సమర్థవంతంగా పరిష్కరించుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా, భారత్‌ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని విపత్కర పరిస్థితులు ఎదురైతే తప్పకుండా అమెరికా, భారత్‌వైపే నిలబడుతుందని ఆయన అన్నారు. ఒకవేళ అనుకొని పరిస్థితుల్లో భారత్, చైనాలకు యుద్ధం వస్తే తప్పకుండా అమెరికా భారత్‌తో కలిసి ముందుకు సాగుతుందని ఆయన అంటున్నారు.


అయితే మా సాయం కోసం భారత్ ఎదురు చూస్తుందని తాను భావించడం లేదన్నారు. ఎందుకంటే ఇటీవల ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు తీసిపోని విధంగా భారత్ అభి వృద్ధి సాధిస్తోందని  అన్నారు. సాంకేతికంగా అన్నీ రంగాల్లో భారత్ సాధిస్తున్న విజయాలు చైనాకు కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయని ఆయన అన్నారు.  అందువల్లే చైనా భారత్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఏ విషయంలోనూ భారత్, చైనా ముందు తీసిపోదని ఆయన అంటున్నారు.


చైనాను సమర్థంగా ఎదుర్కొనే శక్తి ప్రజాస్వామ్య భారత్‌కు ఉందని అందులో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణసియాలో చైనా ఎదిరించి, దాని ముందు దీటుగా నిలబడే శక్తి భారత్‌కు మాత్రమే ఉందన్నారు. అయితే పాకిస్తాన్ కూడా చైనా సరసన చేరి భారత్‌ను దెబ్బతీసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తుందని, దాని కల ఫలించే అవకాశం లేదని ఆయన ఘట్టిగా చెప్పారు.


Image result for india america relations

మరింత సమాచారం తెలుసుకోండి: