త్వరలో నంధ్యాలలో జరగబోతున్న ఉప ఎన్నికల పోరు 2019 ఎన్నికల ముందు జరిగే సెమీ ఫైనల్ గా భావిస్తున్న నేపధ్యంలో తెలుగుదేశం ఎట్టి పరిస్తుతులలోను నంధ్యాల అసెంబ్లీ స్థానాన్ని గెలిచి తీరాలి అన్న పట్టుదలతో చాల పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తోంది. అదేవిధంగా 2019 ఎన్నికలలో అధికారాన్ని సాధించడమే ప్రధాన ధ్యేయంగా అడుగులు వేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడ ఈ నంధ్యాల ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలవడమే ప్రధాన ధ్యేయంగా అడుగులు వేస్తోంది. 

దీనితో జరగబోతున్న ఈ ఉప ఎన్నికల ఫలితం ఈరెండు పార్టీలకు అత్యంత కీలకంగా మారింది. ఇలాంటి కీలక ఎన్నికల సమరం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉన్నా ఈ ఉప ఎన్నికల విషయంలో జనసేన అదేనేత పవన్ తన మనసులో మాటను ఇంతకు వచ్చి తన సన్నిహితుల వద్ద కూడ షేర్ చేయడం లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి.  ఆఖరికి ఆంధ్రప్రదేశ్ లో ఊపిరిలేని కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని నిలుపుతానని ప్రకటిస్తే పవన్ ‘జనసేన’ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎన్నిక జరుగుతోందని తెలిసి కూడ తెలియనట్లుగా ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

పవన్ ప్రస్తుతం బల్గేరియాలో త్రివిక్రమ్ సినిమా కోసం కీర్తి సురేష్ తో రోమాన్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ నెలాఖరు వరకు పవన్ హైదరాబాద్ లోనే ఉండడు. అయితే పవన్ హడావిడి మాత్రం నంధ్యాల ఉపఎన్నికల ప్రచారంలో కనిపించడం పవన్ అభిమానులకు కూడ ఆశ్చర్య పరుస్తున్నట్లు టాక్. ఈ ఉపఎన్నికకు ప్రచారం చేస్తున్న తెలుగుదేశం వర్గాలు తమదైన స్టయిల్ లో ఈ ఉపఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఫోటోలను అడ్డంగా నిలువుగా భారీ సైజులలో ఉపయోగించుకుంటూ పవన్ మద్దతు టీడీపీ కి ఉందని వ్యూహాత్మకంగా తెలియచేయడం పవన్ అభిమానులకే కాకుండా రాజకీయ విశ్లేషకులకు కూడ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

తెలుగుదేశం పార్టీ తరపున తిరుగుతున్న వాళ్లు ఇదే మాట చెబుతున్నారు అని టాక్. అంతేకాదు ‘జనసేన’ జెండాలను తయారు చేయించుకుని తెలుగుదేశం జెండాలతో కలిపి వాడుకోవడం షాకింగ్ మారింది. నంద్యాల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి ఎన్ని ఓట్లు పడతాయి అన్న విషయమై క్లారిటీ లేకపోయినా క్రితం ఎన్నికలలో పవన్ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయమని అడిగాడు కాబట్టి ఇప్పుడు కూడ అదే పద్ధతిని పవన్ చెప్పకపోయినా రిపీట్ చేస్తూ ఏకంగా తెలుగుదేశ వర్గాలు పవన్ కు ఊహించని షాక్ ఇచ్చాయి అని అనుకోవాలి. 

క్షేత్ర స్థాయిలో ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నా పవన్ మాత్రం ఈవిషయాన్ని ఏమాత్రం సీరియస్ గా తీసుకొని నేపధ్యంలో 2019 ఎన్నికలలో కూడ ‘జనసేన’ సపోర్ట్ తెలుగుదేశం పార్టీకే ఉంటుందా అని అనిపించే డట్లుగా నంధ్యాల ఉప ఎన్నిక హడావిడి ఉంది అని అంటున్నారు.ఈ నెలాఖరున పవన్ చంద్రబాబు ల మధ్య ఉద్దానం బాధితుల సమస్యల పై మరొకసారి కీలక సమావేశం జరగబోతున్న నేపధ్యంలో ఈ సమావేశం తరువాత వీరిద్దరి మైత్రి ఇంకా ఎన్ని ట్విస్టులు తీసుకుంటుందో అన్న కామెంట్స్ రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: