తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మెగా స్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాన్.  తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయాలపై అభిమానంతో..ప్రజలకు సేవచేయాలన్న తాపత్రయంతో పవన్ కళ్యాన్ ‘జనసేన’ అనే పార్టీ స్థాపించారు.  అయితే పార్టీ స్థాపించిన కొత్తలో అన్నయ్య మాదిరిగానే కొద్దిరోజుల్లోనే పార్టీ భూ స్థాపితం అవుతుందని ఎంతో మంది విమర్శించారు. అయితే ‘జనసేన’ పార్టీ స్థాపించిన పవన్ మాత్రం ఎన్నికల్లో పోటీ చేయకుండా బిజెపి, టిడిపి లకు సపోర్ట్ చేసి పరోక్షంగా వాటి గెలుపునకు కృషి చేశారు.

తాను ప్రజల తరుపు నుంచి ప్రశ్నించడానికి మాత్రమే ఉన్నానని..ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా ‘జనసేన’ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని చెప్పారు.  ఇప్పటికే ఏపీలో రాజధాని భూ నిర్వాసితుల తరుపు నుంచి పోరాడిన పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని పోరాడుతున్నారు.  అంతే కాదు 2019 జరగబోయే ఎలక్షన్స్ ‘జనసేన’ పార్టీ తరుపు నుంచి తాను కూడా పోటీ చేయబోతున్నానని ప్రకటించారు.   ఈ నేపథ్యంలోనే ప్రతీ జిల్లాలోను శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి.. పార్టీ అవసరాలకు అనుగుణంగా ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారు.  
అయితే కొంత మంది ఇదే అదునుగా పార్టీ పేరు చెప్పుకొని జిల్లాల్లో హల్ చల్ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా,  మరికొంతమంది మరో అడుగు ముందుకేసి.. ఏకంగా వసూళ్లకు కూడా దిగుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాన్ తీవ్రంగా స్పందించారు.  జనసేన పార్టీ ప్రచార కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా చెప్పుకుంటూ మీడియాతో మాట్లాడుతున్నారని జనసేన కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయని.

ఆ వ్యక్తులు చెప్పే మాటలు, వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. విరాళాలు అడిగిన వారి వివరాలను పార్టీ కార్యాలయానికి తెలియజేయండి.  అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులనే పార్టీ తరపున ప్రతినిధులుగా నియమిస్తాము. ఆ సమాచారాన్నిఅధికారికంగా తెలియజేస్తాము." అని పవన్ చెప్పారు.  అంతే కాదు పార్టీ పేరు చెప్పుకొని అక్రమ దందాలకు పాల్పపడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: