నంద్యాల ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం మంత్రులు, ప్రముఖులందరినీ బరిలోకి దించి ప్రచారం చేస్తోంది. టీడీపీ తురుపుముక్క బాలయ్యను కూడా ప్రచారానికి  పంపించింది. అయితే బాలయ్య మాత్రం మేలు చేయకపోగా కీడు చేశారు. దీంతో టీడీపీ ఇరకాటంలో పడింది.

Image result for BALAKRISHNA BEAT NANDYAL

          రాయలసీమలో బాలకృష్ణకు ఫుల్ ఫాలోయింగి ఉంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో బాలయ్యకు వీరాభిమానులున్నారు. ఈ అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మలుచుకునేందుకు నంద్యాల పంపించింది టీడీపీ అధిష్టానం. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా బాలయ్య రాణిస్తున్నారు. ఇది నంద్యాలలో పార్టీకి ఎంతో మేలు చేస్తుందని భావించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే నంద్యాలలో మాత్రం బాలయ్య టీడీపీకి ప్లస్ కంటే మైనస్ గా మారారు.

Image result for BALAKRISHNA BEAT

          నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బాలయ్య డబ్బులు పంచుతూ కెమెరాలకు దొరికిపోయారు. బాలయ్య ప్రసంగం ముగించిన తర్వాత అఖిలప్రియ ప్రచారవాహనం పై నుంచి మాట్లాడారు. ఈ సమయంలో బాలకృష్ణ కొంతమందికి డబ్బులు పంచుతూ దొరికిపోయారు. ఇదిప్పుడు టీడీపీకి పెద్ద తలనొప్పే.! ఎన్నికల కమిషన్ దీన్ని నియమావళి ఉల్లంఘన కింద పరిగణిస్తుంది. కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది.


          నంద్యాల ఉపఎన్నిక ప్రచారాన్ని ముగించుకున్న సమయంలో అభిమానులు బాలయ్యను గజమాలతో సత్కరించేందుకు ముందుకొచ్చారు. ఈ సమయంలో స్వల్ప తోపులాట జరిగింది. అంతే.. బాలయ్యకు ఒక్కసారిగా కోపం వచ్చేసింది. ఓ అభిమానిపై చేయి చేసుకున్నారు. చెంప ఛెళ్లుమనిపించారు. అంతే.. వచ్చిన అభిమానులు తిట్టుకుంటూ వెళ్లిపోయారు.

Image result for BALAKRISHNA BEAT NANDYAL

          నోట్లు పంచడం, అభిమానిపై చేయి చేసుకోవడం.. నంద్యాలలో బాలయ సాధించిన బ్యాడ్ రిమార్క్స్.! ఇవి ఎలాంటి విపరిణామాలకు దారితీస్తాయోనని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. జగన్ చంద్రబాబుపై చేసిన హోట్ కామెంట్స్ .. బాలయ్య చేష్టల తర్వాత కనుమరుగైపోతున్నాయి. మరిప్పుడు టీడీపీ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: