మ‌రో ఏడాదిన్న‌ర కాలంలో  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ఉన్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ప్ర‌క్షాళ‌న దిశ‌గా అడు గులు వేస్తున్నారు. కెబినేట్ ఖాళీ అయిన ప‌దువుల‌ను, ఇత‌ర గ‌వ‌ర్న‌ర్, ఇత‌ర నామినేటేడ్ ప‌దువుల‌ను భ‌ర్తీల‌పై న‌రేంద్ర మోడీ దృష్టి పెట్టారు. వీలైనంత త్వ‌రగా ఈ ఖాళీల‌ను భ‌ర్తీ చేయాల‌న్న ఉద్దేశంతో ప్ర‌ధాని కార్యాచ‌ర‌ణ ప్రారంభించినట్లు బీజేపి, ప్ర‌ధాన మంత్రి కార్యాల‌య వ‌ర్గాల స‌మాచారం. 


ఒక వైపు రాష్ట్రప‌తి, ఉప రాష్ట్ర ప‌తి ఎన్నిక‌లు, పార్ల‌మెంట్ స‌మావేశాలు పూర్తి కావ‌డంతో  2019 ఎన్నిక‌లు ప్ర‌భా వితం చేసేలా కార్య‌చ‌ర‌ణ ఉండాల‌ని ప్ర‌ధాని మోడీ పావులు క‌దుపుతున్న‌ట్లు స‌మాచారం. ఈ ఏడాది గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో వచ్చే ఏడాది ఆరంభంలో పలు ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యం లో, వీలై నంత త్వరగానే ఈ పునర్వ్యవస్థీకరణ జరిగిపోవాల‌ని మోదీ భావ‌న‌.


త‌మిళ‌నాడు లో ని అన్నాడీఎంకే లోని రెండు వ‌ర్గాలు విలీనం జ‌రిగిగే ఆ పార్టీని ఎన్డీఏలో చేర్చుకుని  ఒక‌రికి కాబినేట్ లో చోటు క‌ల్పించాల‌ని మోదీ యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఒకిరికి కేబినెట్ లో  చోటు దక్క‌వ‌చ్చున‌ని స‌మాచారం. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికవటంతో ఆయన చేపట్టిన సమాచార, ప్రసార శాఖ, పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన శాఖలు ఖాళీగా ఉన్నాయి.

అరుణ్‌ జైట్లీ వద్ద అదనంగా ఉన్న రక్షణ శాఖ, దివంగత మంత్రి అనిల్‌ దవే నేతృత్వంలోని అటవీ, పర్యావరణ శాఖలను భర్తీ చేయాల్సి ఉంది. 75 ఏళ్లు దాటిన కల్రాజ్‌ మిశ్రాతోపాటుగా సరైన పనితీరు కనబరచని మంత్రుల పైనా వేటు తప్పదని తెలుస్తోంది. కొత్తగా ఎంపిక చేసుకునే మంత్రులు, వారి శాఖల విషయంలో ప్రాంతీయ, 
కుల సమీకరణాలను ప్రధాని పరిగణనలోకి తీసుకోనున్నారని సమాచారం. 

ఈ సారి కేంద్ర కేబినెట్ లో ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నుంచి ఒకరికి చోటు దక్కనుందనే ఊహాగానాలు వినబడుతు న్నాయి. విశాఖ ఎంపీ హరిబాబు లేదా పార్టీ ప్రధాన కార్య దర్శి రాంమాధవ్‌లలో ఒకరికి బెర్త్‌ ఖాయమని తెలు స్తోంది. ఆగస్టు 28 నుంచి ఏపీలో పర్యటించనున్న అమిత్‌ షా ఇప్పటికే పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడంతో రాంమాధవ్, హరిబాబుల్లో ఒకరిని కేబినెట్ లోకి తీసుకో నున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా పార్టీలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించటంతో పార్టీలో వారి పదవులు ఖాళీగానే ఉన్నాయి. మధ్యప్రదేశ్, తమిళనాడు, బిహార్, అరుణాచల్‌ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలకు పూర్తిస్థాయి గవర్నర్లను నియమించనున్నారు. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణకూ కొత్త గవర్నర్లను కేటాయించే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. ఎలక్షన్‌ కమి షనర్‌ (ముగ్గురికి గానూ ఇద్దరే బాధ్యతల్లో ఉన్నారు), నీతి ఆయోగ్‌కు కొత్త సభ్యులు, బ్యాంకులకు నామినే టెడ్‌ పోస్టులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమిషన్ల పదవులనూ మోదీ వీలైనంత త్వరగా భర్తీ చేయనున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: