నంద్యాల ఉప ఎన్నిక ఘట్టం ఆఖరికి చేరుకోవడానికి ఎంతో టైం లేదు. ఉన్న కొద్ది సమయం లోనే ఏ పార్టీ కి ఆ పార్టీ తమ బలాలు చూపిస్తూ ప్రచారం లో తమదైన బాణీ లో దూసుకుని వెళుతున్నాయి. మొన్న మొదలెట్టిన జగన్ మోహన్ రెడ్డి రోడ్ షో సక్సెస్ఫుల్ గానీ కనిపిస్తోంది. టీడీపీ వైపు నుంచి శ్రేణుల లో ఉత్సాహం నింపారు బాలకృష్ణ. ఆఖరుగా చంద్రబాబు ఈ ప్రాంతం లో పర్యటిస్తారు.


19 న ఆయన రాకతో ఈ ప్రచారం ముగుస్తుంది. అందరి చూపూ ఇప్పుడు చంద్రబాబు ముద్దుల కొడుకు, ఏపీ మంత్రి నారా లోకేష్ మీద పడింది. మొదట్లో ఈ నంద్యాల ఉప ఎన్నిక ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించిన లోకేష్ ఆ తరవాత సైలెంట్ గా ఉండిపోవడం విశేషం.


ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందరా అన్నీ తానే అయ్యి చూసుకున్నారు లోకేష్ కానీ నోటిఫికేషన్ వచ్చాక మాత్రం ఈ మనిషి ఎక్కడా కనపడలేదు. అనేక అభివృద్ధి పనులకి సైతం నోటిఫికేషన్ ముందరే శంకుస్థాపన చేసిన నారా లోకేష్ ఇప్పుడు ప్రచారం చెయ్యాల్సిన టైం మరి.


కానీ ఆయన ఎక్కడా కనపడ్డం లేదు. వ్యూహాత్మకంగా లోకేష్ ని నంద్యాల ప్ర‌చారానికి దూరం పెట్టి ఉంటార‌నే ఊహాగానాలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఒక‌వేళ నంద్యాల ఫ‌లితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేక‌పోతే.. లోకేష్ ని బాద్యుడిని చేస్తారేమో అనే భయం కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: