దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత మరణించి చాలా సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా తమిళనాడు రాజకీయాలు వేడి వేడిగానే సాగుతూ ఉన్నాయి. అధికార పార్టీలో ప్రస్తుతం రెండు వర్గాలనీ ఒకటి చేసే ప్రక్రియ లో భాగంగా ఎవరి రాజకీయాలు వారు నడుపుతున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గాలు ఒకటి చెయ్యడం కోసం కేంద్రం కష్టాలు కేంద్రం పడుతోంది.


ఇలాంటి టైం లో అమ్మ సెంటిమెంట్ ని తెలివిగా తెరమీదకి తీసుకుని వచ్చారు పళని . అమ్మ మ‌ర‌ణంపై న్యాయ విచార‌ణ జ‌రిపిస్తున్న‌ట్టు అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. జయలలిత మరణం మీద మొదటి నుంచీ చాలా అనుమానాలే ఉన్నాయి. చెన్నై అపోలో ఆసుపత్రి లో అమ్మకి నెలల తరబడి చికిత్స జరిగింది.


ఆమె ఎలాంటి అనారోగ్యం తో చనిపోయారు అనే సరైన స్పష్టత ఇప్పటికీ లేదు. ఆమె మరణం తరవాత అనేక పుకార్లు వ్యాపించాయి. కానీ ప్రభుత్వం ఆ విషయం పట్టించుకోలేదు. కానీ, అమ్మ మ‌ర‌ణించిన ఇన్నాళ్ల‌కు న్యాయ విచార‌ణ అంటున్నారు.


రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమీటీ ఏర్పాటు చేసి, అమ్మ మ‌ర‌ణంపై నెల‌కొన్న సందేహాల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని సీఎం ఆదేశించ‌డం విశేషం! దీని వెనకాల రాజకీయ ప్రయోజనాలే కనపడుతూ ఉన్నాయి. పన్నీర్ , పళని వర్గాలు కలవడానికి ఇది పెద్ద వారధి అయ్యే ఛాన్స్ ఉంది. చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌, దిన‌క‌ర‌న్ వ‌ర్గాల‌కు చెక్ పెట్ట‌డం లో భాగంగా కూడా ఈ విచారణ ఐడియా ఉపయోగ పడి తీరుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: