ప్రకృతి కోపిస్తే ఎంతటి వారైనా దాని ప్రతాపానికి తలొగ్గాల్సిందే...ఇక వర్షాకాలంలో అయితే భారీ వరదలు సంబవిస్తే..ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతకాల్సి వస్తుంది.  ఇక భూకంపాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఆ మద్య నేపాల్ లో వచ్చిన భూ కంపం వల్ల కాట్మాండ్ ఎన్నో కట్టడాలు భూ స్థాపితం అయ్యాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇప్పటికీ ఆ ఆనవాళ్లు, ఘటన అక్కడి వారు మర్చిపోలేక పోతున్నారు.  
Image: Mudslide kills hundreds in Sierra Leone
తాజాగా  సియెర్రా రాజధాని ఫ్రీటౌన్‌లో భారీ వర్షాల కారణంగా అక్కడ కొండచరియలు విరిగి పడి 300 మంది సజీవ సమాధి అయ్యారు. మరో 600 మంది గల్లంతయ్యారు.   మృతుల సంఖ్యా మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.  కొండచరియలు విరిగి పడటంతో బురదల్లో, మట్టి పెళ్లల కింద చిక్కుకపోయిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి.
Image result for sierra leone mudslide
భారీ వర్షాల కారణంగా వరదలు అక్కడ ముంచెత్తడంతో సహాయక బృందాలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది.  ఇప్పటి వరకు 297 మృతదేహాలను వెలికి తీశారు. లియెర్రా లియోన్ అధ్యక్షుడు ఎర్నెస్ట్ బై కొరోమా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. చనిపోయిన వారిలో 105 మంది పురుషులు, 83 మహిళలు, 109 చిన్నారులు ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

Image result for sierra leone mudslide


మరింత సమాచారం తెలుసుకోండి: