భారత దేశంలో ఓ మహిళ అర్థరాత్రి స్వతంత్రంగా తిరిగినపుడే..దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని మహాత్మాగాంధీ అన్నారు.  వాస్తవానికి ఇప్పుడు మహిళలు అర్థరాత్రి సంగతి దేవుడు ఎరుగు..పట్టపగలు ఒంటరిగా తిరగాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.  ఎందుకంటే ఏ మూల నుంచి దుండగులు వస్తారో..మెడలో వస్తువులు తీసుకు వెళ్తారో..లేదంటే అత్యాచారం, హత్య చేస్తారో అని భయం భయంగా గడపాల్సి వస్తుంది. 

Image result for women liquor on road india

భారత దేశంలో ప్రతిరోజు మహిళలపై, యువతులపై, చివరకు చిన్నారులపై కొంత మంది కామాంధుల అత్యాచారాలు విపరీతం అయ్యాయి. మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అని ప్రతిరోజు వార్తల్లో చదువుతూనే ఉన్నాం. ఓ వైపు మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ది చెందేలా చూడాలని అంటున్నారు.  అయితే ఆ విషయంలో ఏమో కాని ఈ మద్య కొంత మంది యువతులు మాత్రం మద్యం విషయంలో పురుషుతో సమానంగా తమ సత్తా చాటుతున్నారు. తాజాగా  ఓ మహిళ నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా రాత్రి వేళలో ఫుడ్ కోర్ట్ వద్ద బీరు తాగుతూ హల్ చల్ చేసింది.  


అప్పటికే కాస్త మందు పుచ్చుకున్న ఈ మహిళ అది సరిపోక మరో బీర్ బాటిల్ తీసుకొని పబ్లిక్ గానే రోడ్డు పై తాగుతూ..తూలుతూ కనిపించింది.  బెజవాడలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: