నంద్యాల లో ప్రచారానికి మూడే మూడు రోజులు ఉంది. సరిగ్గా ఇలాంటి టైం లోనే తమ టాలెంట్ చూపిస్తూ ప్రత్యర్ధుల ని కట్టడి చెయ్యడం అనేది చాలా అవసరం గా భావిస్తున్నారు రెండు పక్షాల వాళ్ళూ. మూడు రోజుల తరవాత మైకులకి పని ఉందని పరిస్థితి.


ఓటు మ్యానేజ్మెంట్ చేసుకుంటే చాలు ... అత్యంత కీలకమైన దశ లో టీడీపీ వైకాపా కదలికల మీద పూర్తి దృష్టి పెట్టింది. వైకాపా శ్రేణుల చిన్న చిన్న కదలికలు కూడా దగ్గరుండి టీడీపీ నాయకులు గమనిస్తూ ఉన్నారు.


డబ్బు పంపిణీ అనేది వైకాపా నుంచి ఏ రకంగా కూడా జరగకూడదు అనే గట్టి నిర్ణయం తో ఉన్న కొందరు టీడీపీ నాయకులు, వారి దగ్గర డబ్బు బయట పడితే వెంటనే పోలీసులకీ , ఈసీ కీ పంపిణీ చేసెయ్యాలి అనే ప్లాన్ లు వేస్తున్నారు. నంద్యాల‌లో తాజాగా ఓ ఇర‌వై మంది వైసీపీ కార్య‌క‌ర్త‌లు డ‌బ్బులు పంచుతూ దొరికిపోయారు. వారి ద‌గ్గ‌ర కొంత సొమ్ము కూడా ఉంది.


వీరిని ప‌ట్టించింది అధికార పార్టీ కార్య‌క‌ర్త‌లే అని అంటున్నారు. కొన్ని ప్రాంతాలలో చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ ని ఇప్పటికే టీడీపీ ఏర్పాటు చేసుకుంది. సరిగ్గా ఈ డబ్బులు పంచే క్రమం లో వైకాపా ని అడ్డుకోవడం లో సూపర్ సక్సెస్ అవుతోంది టీడీపీ.వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి ఓటర్ల‌కు డ‌బ్బులు పంచుతున్నార‌నీ, ప్రజలకు కొన్ని స్లిప్పులు ఇచ్చి, శిల్పా స‌హకార సంస్థ వ‌ద్ద సొమ్ము ఇస్తున్నారంటూ టీడీపీ నేత‌లు ఎన్నిక సంఘానికి ఎమ్మెల్సీ జ‌నార్థ‌న్ లేఖ రాశారు. అక్కడితో ఆగకుండా హైదరాబద్ లోని ఎన్నికల సంఘానికి ఎంపీ కేసినేని తో కలిసి వెళ్ళారు కూడా. ఎన్నికల నిబంధనలకి విరుద్ధంగా వైకాపా డబ్బు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికింది అని అంటున్నారు వాళ్ళు. 

మరింత సమాచారం తెలుసుకోండి: