ఇప్పుడు ఇదే విష‌యం అటు ఇండ‌స్ట్రీలోనూ, ఇటు పొలిటిక‌ల్ డ‌యాస్‌పైనా పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీస్తోంది. టీడీపీతో అంట‌కాగితేనే ప‌వ‌న్‌కి పొలిటిక‌ల్ లైఫ్ ఉంటుంద‌ని, దానిని వీడిన మ‌రుక్ష‌ణం ప‌వ‌న్‌ను పెద్ద విలన్ మాదిరిగానో, రాజ‌కీయాల్లో పెద్ద బ‌ఫూన్ మాదిరిగానో చిత్రీక‌రించేందుకు ఓ వ‌ర్గం మీడియా ముఖ్యంగా చంద్ర‌బాబు అండ్ కోకి వంత పాడుతున్న మీడియా రెడీగా ఉంద‌ని చ‌ర్చ న‌డుస్తోంది.  అంతేకాదు, ప‌వ‌న్ పొలిటిక‌ల్ కెరీర్‌ను సైతం దెబ్బ‌తీసేలా, పాత సంగ‌తులు తొవ్వి తీసి ఏకేసేందుకు కూడా ఈ మీడియా ఎంత‌మాత్ర‌మూ వెనుకాడే ప‌రిస్థితి ఉండ‌ద‌ని కూడా అంటున్నారు.  మ‌రి విష‌యం ఏంటో చూద్దామా..

janasena pawan kalyan-chandrababu కోసం చిత్ర ఫలితం

ప్ర‌స్తుతం రాష్ట్రాన్ని నంద్యాల ఉప పోరు హీటెక్కిస్తోంది. వైసీపీ, అధికార టీడీపీలు ఈ ఉప ఎన్నిక‌ను మ‌నుట‌యా.. మ‌ర‌ణించుట‌యా.. అన్న రేంజ్‌లో ఛాలెంజ్‌గా తీసుకున్నాయి. ఫ‌లితంగా ఇది అస‌లు ఉప ఎన్నికా.. సాధార‌ణ ఎన్నికా.. లేక అంత‌కు మించా.. ? అన్న చ‌ర్చ‌కు కూడా ప‌రిస్థితి వెళ్లిపోయింది.  దీంతో ఏ పార్టీకి ఆ పార్టీ.. త‌న‌కు అంది వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ వాడేసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల‌కు సినీ గ్లామ‌ర్ స‌హా మిత్ర ప‌క్షాల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టాల‌ని బాబు డిసైడ్ అయ్యారు. దీంతో వెంట‌నే ఉప ఎన్నిక‌, అందునా చిన్న ఎన్నిక‌, కేవ‌లం రెండేళ్ల కాలానికి జ‌రుగుతున్న ఎన్నిక అని కూడా ఆలోచించ‌కుండా త‌న వియ్యంకుడు, ప‌బ్లిక్  ఫిగ‌ర్ బాల‌య్య‌ను రంగంలోకి దింపాడు.


ఇక‌, త‌న మిత్ర‌ప‌క్షం జ‌న‌సేనాని ప‌వ‌న్ మ‌ద్ద‌తు కూడా కూడ‌గ‌డితే.. ఇంక విజ‌యం త‌న‌దేన‌ని బాబు యోచించాడు. అయితే, అనూహ్యంగా ప‌వ‌న్ 2014 లో ఉన్న మిత్ర బంధాన్ని కాసేపు ప‌క్క‌న పెట్టి. . నంద్యాల ఉప పోరులో తాను త‌ట‌స్థం అని వెల్ల‌డించేశాడు. అంతే! ఇంకేముంది బాబు గారికి కోపం న‌షాళానికి ఎక్కేసింది. ఇక‌, త‌న అమ్ముల పొదిలోని అనుకూల మీడియా అస్త్రాన్ని ప‌వ‌న్‌పై ప్ర‌యోగించేశారు. టీడీపీతో ఉంటేనే ప‌వ‌న్‌కి బ‌తుకు, టీడీపీని విడిచి పెడితే.. ఏమీ లేదు.. అనే యాంగిల్‌లో క‌థ‌నాన్ని తెల్లారేస‌రికి వండి వార్చేశారు.

janasena pawan kalyan-chandrababu కోసం చిత్ర ఫలితం

నిజానికి ప‌వ‌న్ అంత ప‌రాన్న‌జీవి కాదు! ఒక‌రిని ఆధారంగా చేసుకుని రాజ‌కీయాలు చేయాల్సిన అవ‌స‌రం లేదు. 2014లో ఎవ‌రు ఎవ‌రి మీద ఆధార ప‌డ్డారో ఏపీ మొత్తానికి తెలుసు. కానీ, త‌న పంతం నెగ్గ‌క‌పోతోంద‌నే ఆతృత‌, అక్క‌సుతో చంద్ర‌బాబు.. ప‌వ‌న్‌పై లేనిపోని అభాండాలు వేసి అనుకూల మీడియాలో క‌థ‌నాలు ప్ర‌సారం చేయించారు. కేవలం త‌ట‌స్థం అంటేనే  ప‌వ‌న్ త‌డ‌బాట పేరుతో స్టోరీ రాయించారు. 


అదే.. తాను కూడా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌నో, లేదా వైసీపీ కి మ‌ద్ద‌తిస్తాన‌నో అనుంటే ప‌రిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో అని విమ‌ర్శ‌కులు సైతం నోరెళ్ల బెడుతున్నారు. మొత్తానికి టీడీపీతో ఉంటేనే ప‌వ‌న్ గొప్ప లేక‌పోతే ప‌వ‌న్‌కు బ‌తుకే లేదు.. అనే యాంగిల్ చెండాలంగా ఉంది బాబూ! అని వాళ్లు అనేస్తున్నారు కూడా!!

janasena pawan kalyan-chandrababu కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: