ఒక అతిపెద్ద దేశం ఓకే అతిచిన్న దేశం మీద అణు ఆయుధాలతో దాడి చేస్తే ఎలా ఉంటుంది ? ఊచకోత లు చేసుకుంటూ బాంబుల వర్షం కురిపిస్తే అసలు ఆ చిన్న దేశం తట్టుకునే పరిస్థితి ఉందా ? ఇలాంటి అనేక ప్రశ్నలకి సమాధానం దొరికింది.


అమెరికా ఒక్కాసారిగా ఉత్తర కొరియా మీద గనక దాడి చేస్తే దాని తీవ్రత మైండ్ బ్లోయింగ్ అంటున్నారు ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి జాన్ మాటిస్. వాషింగ్టన్ లో మాట్లాడిన ఆయన గువాం ద్వీపం మీద ఉత్తర కొరియా దాడికి దిగబోతోంది అని తమదగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అనీ ఒకవేళ అదే జరిగితే గనక ఉత్తర కొరియా మీద నిర్దాక్షణ్యం గా దాడి చేస్తాం అని ఆయన ప్రకటించారు.


అలాంటి దాడి జరిగితే కేవలం ఉత్తరకొరియాకు మాత్రమే కాదని, దక్షిణకొరియాతో పాటు జపాన్‌ కూడా తీవ్రంగా దెబ్బతినేదని అన్నారు. " ఈ మూడు దేశాల్లో శవాల గుట్టలు కనిపిస్తాయి.


అణు దాడి అంటూ జరిగితే కేవలం ముప్పై సెకన్ల వ్యవధి లో ముప్పై వేల మంది చచ్చిపోతారు. ఆ లెక్కన అరగంట లో పది కోట్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలా జరగడం మాకు ఇష్టం లేని పని. అణుదాడులు ప్రపంచ వినాశనానికి కారణమవుతాయని, అంతకు మించి వాటితో సాధించేదేమీ ఉండదు " అంటూ ఆఖర్లో హితవు పలికారు ఆయన. 

మరింత సమాచారం తెలుసుకోండి: