"నీవు నా ఇరుగింట్లో కాపుకాస్తే, నేను నీ పొరుగింట్లో చేరిపోతా" అని దీటైన ప్రతిసవాల్ భారత్ చైనాకు విసురుతూనే ఉంది. చైనాకు గేం ఆడటం కంటే మైండ్ గేం  ఆడటం లో చాలా సామర్ధ్యం ఉంది. ఇన్నాళ్ళుగా భారత్ సౌమ్యంగా నడచుకోవటాన్ని చినా భారత్ ను చులకన భావం తో చూస్తుంది. అంతేకాదు మన ప్రధాన శతృదేశం   పాకిస్తాన్ తో స్నేహం చేయటమే కాదు ఆదేశపు ఉగ్రవాదులను అంతర్జాతీయ సంస్థలైన ఐఖ్యరాజ్య సమితి లో ఉగ్రవాదులుగా గుర్తించవలసిన సమయం లో తన వీటో హక్కును ప్రయోగించి కాపాడుతూవస్తుంది.



Image result for brahmos missile to vietnam



అంతేకాదు మన దేశానికి న్యూక్లియర్ సప్లై గ్రూప్ (ఎనెస్జి) లో స్థానం లభించ కుండా అడ్డుపడుతూనే ఉంది. ఇంత కాలం కాంగ్రెస్ హయాం లో తలవంచిన భారత్ నరెంద్ర మోడీ ప్రధాని అయిన తరవాత తాను యుద్ధానికి సయ్యంటూ ఢీ కొనటమే కాదు అంతర్జాతీయంగా తన పలుకుబడి పెంచుకొని తానూ చైనా మైండ్ గేముకు స్పందించకుండా అనేకంటే లెక్కచేయ కుండా ఢీ అంటే ఢీ అనటం జరుగుతుందని తెలిసిందే.


Image result for brahmos missile to vietnam

   
డోక్లాం ప్రాంతంలో సైన్యాన్ని మోహరించి చైనాకు గట్టి బదులిస్తోన్న భారత్, తాజాగా మరో ఝలక్ ఇచ్చింది. తన అమ్ముల పొదిలోని బ్రహ్మాస్త్రాన్ని డ్రాగన్‌కు విరోధి అయిన వియత్నాం కు అందించింది. ప్రపంచంలోనే అత్యంత వేగమైన 'యాంటీ షిప్ క్రూయిజ్ మిసైళ్ల' యిన బ్రహ్మోస్ క్షిపణులను భారత్ తమకు విక్రయించిందని వియత్నాం ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం భారత్ పొరుగు దేశాలకు సాయం పేరుతో అనేక ఇన్-ఫ్రా నిర్మాణాలను, రహదారుల నిర్మాణాలను చేపట్టి భారత్ చుట్టు భారత్ రక్షణకు అస్థిరత సృస్టిస్తుంది. దీన్ని ఎదుర్కోవటానికే భారత్ ఇటీవల వియత్నాం, జపాన్, మలేషియా లాంటి దక్షిన చైనా సముద్రతీర ప్రాంత దేశాలతో సన్నిహితంగా మెలుగుతుంది. అవి కూడా ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ సహకారం కోరుకోవటం జరుగుతూవస్తుంది. అందుకే వియత్నాం కు భారత్ తన చిరకాల స్నేహాన్ని మరింత పటిష్ఠ పరచుకునే క్రమం లో తన సహ్కారం అందించటములో ముందు నిలిచింది.    


Image result for brahmos missile to vietnam


స్వల్పశ్రేణికి చెందిన ఈ మిసైళ్లు ధ్వని వేగం కంటే 2.8 రెట్ల వేగంతో లక్ష్యాలను సాధించగలవు. ఇటీవలే భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులు తమ దేశం చేరాయని వియత్నాం ప్రకటించగానే, చైనా ఉలిక్కిపడింది. ​కాగా 'బ్రహ్మోస్ డీల్' ఇంకా చర్చలదశలోనే ఉందని భారత్ స్పష్టం చేసింది. బ్రహ్మోస్ క్షిపణులను రష్యా, భారత్ కలిసి సంయుక్తంగా తయారు చేశాయి. ఇవి గంటకు 3,400 కి.మీ - 3700 కి.మీ. వేగంతో నిర్దేశించిన లక్ష్యాలను చేదించగలవు.

Image result for brahmos missile to vietnam



మూడు టన్నుల బరువు ఉండే వీటిని భూ ఉపరితలం నుంచే కాకుండా, సముద్ర జలాలపై నుండి సబ్ మెరైన్లు, యుద్ధ నౌకల ద్వారా, అలాగే గగనతలంపై నుండి విమానాల నుంచి కూడా ప్రయోగించే వీలుంది.  290 కి.మీ. దూరంలోని లక్ష్యాలను చేదించేలా మొదటగా వీటిని రూపొందించినప్పటికీ, 400 కి.మీ. దూరంలోని లక్ష్యాలను సైతం చేదించేలా వీటిని అభివృద్ధి చేశారు. భారత్ ఇప్పటికే గస్తీ నౌకలను వియత్నాంకు ఇచ్చింది. అంతేగాకుండా, వియత్నాం కు సైనిక శిక్షణ కూడా ఇస్తోంది.  సబ్‌మెరైన్ల వాడకంపై (విశాఖపట్నంలో)  శిక్షణ ఇచ్చింది. ఎన్నాళ్లుగానో బ్రహ్మోస్ విక్రయించాలని వియత్నాం మన దేశాన్ని కోరుతోంది.


Image result for brahmos missile to vietnam



వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ఎంత ధరకు విక్రయించందనే విషయం తెలియరాలేదు. వియత్నాంకు తూర్పు న ఉండే  "దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదేనని చైనా వాదిస్తోంది" దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణాత్మక వివాదం నడు స్తోంది. చైనాను ఎదుర్కోవడం కోసం వియత్నాం ఇటీవలే రష్యా నుంచి రెండు బిలియన్ డాలర్లు వెచ్చించి మరీ డిజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్లను కొనుగోలు చేసింది.


Image result for brahmos missile to vietnam



దేశ భద్రత కోసం భారత్‌తో రక్షణ రంగంలో సహకారాన్ని కొనసాగిస్తామని వియత్నాం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి 'లి థి థూ హాంగ్' మీడియాకు తెలిపారు. స్వీయ రక్షణ కోసం ఈ ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. భారత్, వియత్నాం మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పెరుగుతోందని ఆమె తెలిపారు. ఆర్థిక బలంతో చైనా, భారత్ పొరుగున ఉన్న శ్రీలంక, నేపాల్ లాంటి దేశాలను తన వైపు తిప్పుకోగా, ఇప్పుడు భారత్ కూడా చైనా అంటే గిట్టని దాని పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను పెంచుకుంటూ, డ్రాగన్‌ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తోంది.


Image result for brahmos missile to vietnam

మరింత సమాచారం తెలుసుకోండి: