తెలంగాణా ప్రజల కీ తెలంగాణా ప్రాంతానికీ ఈ బతుకమ్మ పండగ చాలా  ప్రత్యేకమైనది .. ఈ పండుగ సందర్భంగా మహిళల కి ఉచితంగా చీరలు పంపిణీ చెయ్యడం కోసం ప్రభుత్వం సిద్ధం అవుతోంది.


చేనేత కి కూడా అండగా ఉండాలి అనే ప్రభుత్వ సంకల్పం తో దాదాపు తొంభై లక్షల చీరలని ఉచితంగా పంపిణీ చెయ్యబోతున్నారు అది కూడా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి. దీన్లో భాగంగా సిరిసిల్ల చేనేత కార్మికులకి అరవై లక్షల చీరలు ఆర్డర్ ఇచ్చారు.


సూరత్ టెక్స్‌టైల్ మిల్స్‌కు మరో 30 లక్షల చీరలకు ఆర్డర్ ఇచ్చింది.అయితే ఈ నిర్ణయం మీద అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. చేనేత అంటే ఒక్క సిరిసిల్లే కాదని, పోచంపల్లి, కొయ్యలగూడెం, గద్వాల, నారాయణపేట, పుట్టపాక కూడా ఉన్నాయన్న సంగతిని విస్మరించడం దారుణమని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.


రాజకీయంగా వచ్చే ఎన్నికల టైం కి తమ కోసం సిరిసిల్ల ప్రాంత స్థానం సుస్థిరం చేసుకోవడం కోసమే కేటీఆర్ ఇలాంటి ప్లాన్ ప్లే చేస్తున్నారు అని కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. అసలు సిరిసిల్ల కార్మికులు చేనేత కిందకు రారని, వారు పవర్ లూములు ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్ వాదిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: