ఎలాంటి అంశమైనా రోజుల తరబడి చర్చ జరపడం లో మన తెలుగు వాళ్లకి మించినవారు ఉండరు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ ఇద్దరు కలిసినా నంద్యాల ఉప ఎన్నిక గురించే విపరీతంగా మాట్లాడుకుంటూ ఉన్నారు అనేది తెలుస్తోంది.


ఒకపక్క జగన్ మరొక పక్క చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకం గా తీసుకున్న ఈ నంద్యాల ఉప ఎన్నిక నువ్వా నేనా అన్నట్టు నడుస్తోంది కథ. గతం లో కూడా ఒకసారి ఇక్కడ జరిగిన ఎన్నిక దేశవ్యాప్తంగా సంచలనం రేకేట్టిన్సింది.


1996 ప్రాంతం లో సార్వత్రిక ఎన్నికలో అప్పటి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నంద్యాల నుంచే బరిలోకి దిగారు. ఇక్కడ తో పాటు ఒరిస్సా లోని బరంపురం లో ఆయన పోటీ చేసారు.


 రెండు చోట్లా విజయం సాధించిన తర్వాత నంద్యాల పార్లమెంటు స్థానానికి రాజీనామా చేశారు. అప్పట్లో పీవీ కి భూమా నాగిరెడ్డి ప్రత్యర్ధి గా ఉన్నారు. టీడీపీ అభ్యర్ధి అయిన భూమా మీద ఐదు లక్షల ఓట్ల మెజారిటీ తో గెలిచారు పీవీ.  మరి ఇప్పుడు జరుగుతున్న ఉప ఉన్నికలో 1996లో నమోదైన రికార్డు ఏమైనా బద్దలవనుందా?అసలు ఆ ఛాన్స్ లేదు అనే చెప్పాలి. కానీ ఆసక్తి మాత్రం ఆ రేంజ్ లోనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: