గ‌త మూడెళ్లుగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేయాల్సిన, చేసిన అభివృధ్ధి ప‌థ‌కాల‌పై  ప్ర‌తి ప‌క్ష జ‌గ‌న్ ఫుల్ క్లారిటీ నిచ్చారు. ఎలాంటి విష‌యానైనా త‌డ‌బ‌డ‌కుండా గంటోపాయంగా చెప్పే జ‌గ‌న్ చంద్ర‌బాబు పై ఒక రకంగా నిప్పు లు చెరిగార‌నే చెప్పొచ్చు. ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌నానంత‌రం మాయ‌మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర బాబు చెప్పేది ఒక‌టి చేసేది ఒక‌టి అన్న చంద్రంలా మారిందన్నారు.
  
 నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చంద్ర‌బాబుపై ఒకింత మాట‌ల యుద్దానే ప్ర‌క‌టించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తాన‌న్న చంద్ర‌బాబు క‌నీసం జిల్లాకో ఉద్యోగం కూడా ఇవ్వ‌లేద‌న్నారు. రైతులు, డ్వాక్రా మ‌హిళ‌ల రుణాలు మాఫీ చేస్తాన‌న్నాడు. ఉద్యోగాలు ఇవ్వ‌ని ఇంటికి రూ. 2వేల నిరుద్యోగ భృతిని అందిస్తామ‌ని నిరుద్యోగ యువ‌త‌ను మోసం చేశార‌న్నారు. 


వాస్త‌వానికి గ‌త 2014 ఎన్నిక‌ల స‌మయంలో జాబు కావాలంటే బాబు రావాలి అన్న నినాద‌మే బాబుకు మంచి మెజారిటీని తెచ్చిపెట్టింది.అలాంటి యువ‌త‌కు క‌నీసం సానుభూతిని సైతం చూప‌డంలేదు క‌దా, క‌నీసం ఆ దిశ‌గా ఆలోచించ‌డం లేదు. ఇక రైతుల రుణాలు, డ్వాక్రా మ‌హిళ‌ల రుణాలు సైతం అదే దుస్థితి ఉంది.  ఒకే సారి అధికారంలోకి వ‌చ్చిన సీఎం కేసీఆర్ ను చంద్ర‌బాబు తో పొల్చుకుంటే భారీ వ్య‌త్యాస‌మే క‌నిపిస్తుంది. 

కేసీఆర్ ల‌క్ష ఉద్యోగాలు ఇస్తాన న్నారు అదే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అగ‌ష్టు 15 న ఉద్యోగాల భ‌ర్తీకి సంబం ధించిన జీవోను విడుద‌ల చేశారు. వైఎస్ జ‌గ‌న్ హాయాంలోనే పేద‌ల‌కు భ‌రోసా అని చెప్పాడు జ‌గ‌న్ పేద లేవ‌రూ విద్య, వైద్యం విష‌యంలో అప్పుల‌పాలు కాకూడ‌ద‌ని భావించిన దివంగ‌త నేత సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఫీజు రీయంబ‌ర్స్ మెంట్‌, ఆరోగ్య శ్రీ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. 

పేద విద్యార్ధులు ఇంజినీరింగ్‌, డాక్ట‌ర్ క‌లెక్ట‌ర్ వంటి గొప్ప గొప్ప చదువులకు తోడుగా ఉంటాన‌ని ఫీజులు చెల్లిం చారు. అయితే తాజా చంద్ర‌బాబు హాయాంలో విద్యార్ధుల ప‌ట్టింపు చాలా త‌క్కువే న‌ని చెప్పొచ్చు. గ‌తంలో ఇంజినీరింగ్ చ‌దువుతున్న విద్యార్ధుల‌కు ఏటా రూ. ల‌క్ష ఖ‌ర్చు అవుతుండ‌గా కేవ‌లం రూ. 35 వేలు మాత్ర‌మే ఇస్తు న్నారు. 

ఇక ఆరోగ్య శ్రీ ప‌థకం విష‌యంలో సైతం చంద్ర‌బాబు తీరు అధ్వ‌నంగానే ఉంది. దాదాపు 8 నెల‌లుగా నెట్ వ‌ర్క్ ఆసుపత్రుల‌కు బిల్లులు చెల్లించ‌లేదు. కీమోథెర‌పీ, డ‌యాల‌సిస్ వంటి వాటికి చంద్ర‌బాబు స‌ర్కార్ ష‌ర‌తులు పెట్టింది. ఇలా చంద్ర‌బాబు ప‌రిపాల‌న తీరు పై వైఎస్ జగ‌న్ నంద్యాల ఉప ఎన్నిక‌ల వేదిక‌గా ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: