నంద్యాల లో ఉప ఎన్నికల ప్రచారం ఆఖరి దశకి చేరుకుంది. 2014 ఎన్నికల తరవాత రాష్ట్రము లో జరుగుతున్న మొట్ట మొదటి ఉప ఎన్నిక కావడం తో టీడీపీ - వైకాప ఇద్దరూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఎన్నికని.


దాదాపు 1400 కోట్లు ఖర్చు పెట్టి టీడీపీ ఈ ప్రాంతం లో అభివృద్ధి పనులు చేయిస్తోంది. టీడీపీ ని గెలిపించకపోతే పనులు మధ్యలోనే ఆగిపోతాయి అనే ఫీలింగ్ తో అయినా తమని గెలిపిస్తారు అనేది టీడీపీ భరోసా.


మాజీ మంత్రి ఫరూక్ టీడీపీ లో మొన్నటి వరకూ పెద్ద ప్రాధాన్యత ఉన్న నేతే కాదు కానీ ఇప్పుడు మాత్రం ఆయన ముఖ్యం అయ్యారు. నంద్యాల ఎలక్షన్ లో మైనారిటీ ల ఓట్లు చాలా కీలకంగా మారాయి.


ఇదివరకు ఎదురుకొన్న ఇలాంటి సమస్య తిరిగి జరగకూడదు అని ఆయనకి హుటాహుటిన ఎమ్మెల్సీ ఇచ్చారు టీడీపీ వారు.గ‌తంలో ఎదుర్కొన్నామ‌న్న నిర్ల‌క్ష్య భావ‌న నుంచి ఆయ‌న బ‌య‌ట‌కి వ‌చ్చి, పార్టీ గెలుపున‌కు ఏ స్థాయిలో కంక‌ణబ‌ద్ధులై ఉన్నార‌నేది మ‌రో ప్ర‌శ్న‌? మైనారిటీ లే నంద్యాల ఓటు బ్యాంకు లో ప్రధాన వనరుగా మారారు .

మరింత సమాచారం తెలుసుకోండి: